IKP VVOAs Express Anguish Over Government Neglect
ఐకేపీ వివోఏలపై ప్రభుత్వాల నిర్లక్ష్యంపై ఉద్యోగులు తీవ్ర ఆవేదన
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కేంద్రమైన ఐకేపీ వీవోఏలు 18 సంవత్సరాల నుండి పనిచేస్తున్న పేదరిక నిర్మూలన సంస్థ ఎన్నో ఏళ్లుగా గ్రామ స్థాయిలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ, వరుస ప్రభుత్వాలు తమ సమస్యలపై దృష్టి పెట్టకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. “అన్ని ప్రభుత్వాలు ఇప్పటి వరకు వివోఏలను వెట్టి చాకిరి కింద పనిచేయించుకోవడం తప్ప, మా మీద న్యాయం చేసే నాయకులు ఎవరు. ముందుకు రాలేదు” అనివీవోఏ ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరం లేకపోవడంతో ఈ ఉద్యోగాన్ని పట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి వచ్చిందని, వసుదేవుడు పోయి గాడిద కాళ్లు పట్టుకున్న పరిస్థితి తమదేనని ఉద్యోగులు వ్యాఖ్యానించారు. తమ హక్కులు, వేతనాలు, భద్రత, ప్రోత్సాహకాలు వంటి అంశాలపై ఎవరూ స్పందించడం లేదని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐకేపీ వీవోఏ మొహమ్మద్ ఐకేపీ వివోఏ ఝరాసంగం ఉద్యోగుల సమస్యలను పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
