ముదిగుంట గ్రామంలో ఘనంగా ప్రారంభమైన ఎల్లమ్మ తల్లి బోనాల పండుగ

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలో ఆదివారం రోజున ఎల్లమ్మ తల్లి బోనాల పండుగ ఘనంగా ప్రారంభమైంది. నాలుగు రోజులు నిర్విరామంగా కొనసాగే ఈ వేడుకలో మొదటి రోజు పోచమ్మ తల్లి బోనాలతో మొదలు పెట్టడం జరిగింది. 5 సంవత్సరాలకు ఒకసారి గ్రామంలోని గౌడ కులస్తులు అందరూ కలిసి అంగరంగ వైభవంగా గొప్ప ఉత్సవంగా జరుపుకొనే ఈ కార్యక్రమం ముదిగుంట గ్రామమంతా ఒక పండుగ వాతావరణన్ని తలపిస్తుంది. ఎల్లమ్మ తల్లి కొలుపు వేడుకల్లో భాగంగా మొదటి రోజు ఆదివారం నాడు గౌడ కుటుంబంలోని ప్రతి ఆడపడుచులు అందరూ కలిసి పోచమ్మ తల్లి బోనాలు ఎత్తుకొని మేళతాళాలతో డప్పు చప్పులతో పంబాల కళాకారులతో అమ్మవారికి మొక్కులు చెల్లించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి, అమ్మవారి కృపకు పాత్రులు కావడానికి, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో నివసించే వారంతా సొంతగూటికి చేరుకొని బంధుమిత్రులతో గౌడ కుటుంబాలన్నీ కలిసికట్టుగా ఈ ఉత్సవానికి ఆనందంగా హాజరయ్యారు.ఒగ్గు కళాకారులతో ఎల్లమ్మ తల్లి జీవిత చరిత్రను కథ రూపంలో ప్రజలందరికీ తెలియజేస్తూ ఉత్సవాన్ని మొదలుపెట్టారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనిఈ ఉత్సవాన్ని విజయవంతం చేసి ఎల్లమ్మ తల్లి కృపకు పాత్రులు కావాలని గౌడ సంఘ పెద్దలు కులస్తులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!