ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు
పరకాల నేటిధాత్రి
ఉపాధి హామీ పథకం ద్వారా చిన్న సన్న కారు రైతులకు హార్టికల్చర్ పంటలు మంజూరు కొరకు రైతులకు అవగాహన కల్పించి ప్రతిపాదనలు సమర్పించాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.బుధవారం రోజున మండల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరకాల మండలానికి 70 ఎకరాలు మంజూరు అయిందని పంచాయతీ కార్యదర్శులు మరియు ఫీల్డ్ అస్టెంట్లు వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో గ్రామంలో సన్న చిన్న కారు రైతులకు అవగాహన కల్పించి రెండు మూడు రోజుల్లో ప్రతిపాదనలు సిద్ధం చేసి మండల పరిషత్ కార్యాలయంలో అందజేయాలని ఆదేశించారు.
ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులుచిన్న సన్న కారు రైతు సర్టిఫికేట్,ఆధార్ కార్డు జాబ్ కార్డు,సెల్ ఫోన్ నెంబర్, పట్టా దారు పాస్ బుక్ జిరాక్స్ కాపీలు పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు తో పాటు అందజేయాలని అన్నారు.ఇట్టి పండ్లతోటల పెంపకమునకు గాను రైతులకు రెండు సంవత్సరముల వరకు ఉపాధి హామీ ద్వారా మెయింటెనెన్స్ చార్జీలు మరియు మొక్కలు ఖర్చు,గుంతలు తీయుటకు కూలీల ఖర్చు ఉపాధి హామీ ద్వారా చెల్లించడం జరుగుతుందని మండల పరిధిలోని సన్న చిన్న కారు రైతులు ఈ సదావకాశాన్ని వినియోగించు కోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి ఇమ్మడి భాస్కర్,ఏపిఓ ఇందిర, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు,ఫీల్డ్ అసిస్టెంట్లు,తదితరులు పాల్గొన్నారు.