బస్వరాజుపల్లి లో విద్యుత్ ప్రజా బాట
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం బస్వ రాజు పల్లి గ్రామంలో శనివారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ చింతకుంట్ల సునీత శ్రీనివాసు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఏఈ వెంకటరమణ మాట్లాడుతూ విద్యుత్ ప్రజాబాట సందర్భంగా గ్రామాలలో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు అంతేగాక విద్యుత్ సమస్యలు ఏదైనా మా దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందించి పరిష్కరిస్తాము అన్నారు
