Electricity Corruption in Zaheerabad Division
ప్రైవేట్ కాంట్రాక్టర్లతో విధ్యుత్ అధికారుల దోస్తీ!
◆ – సంవత్సరాలు గడిసిన డివిజన్ లోనే బదిలీలకు కారణం..?
◆ – ఇతర డివిజన్ లకు ఏఈలు ఎందుకు బదిలీ కావడం లేదు
◆ – మన్నాపూర్, న్యాల్కల్, కోహిర్ సబస్టేషన్ పరిధిలోని దారుణం
◆ – రైతులకు నూతన విధ్యుత్ కనెక్షన్, ట్రాన్ఫర్మర్ కావాలన్న డిమాండ్
◆ – డబ్బులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నాం అంటున్న రైతులు
◆ – జహీరాబాద్ డివిజన్ విధ్యుత్ అధికారుల పై చర్యలెందుకు లేవు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి:జహీరాబాద్ డివిజన్ విద్యుత్ పంపిణీ సంస్థల్లో కొంత మంది అధికారులు ప్రైవేట్ కాంట్రాక్టర్లతో జతకట్టి అందినకాడికి దండుకుంటున్నారు.

కొత్త విద్యుత్ కనె క్షన్ల జారీ మొదలు, ప్యానల్బోర్డులకు ఎస్టిమేషన్, ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్, విద్యుతీగల షిఫ్టింగ్ ఇలా ఏ పని చేయాలన్నా ప్రైవేట్ కాంట్రాక్టర్లను కలవా ల్సిందే. కస్టమర్ సర్వీస్ సెంటర్లులో ఎవరైనా నేరుగా వెళ్లి దరఖాస్తు చేస్తే పత్రాలు సరిగా లేవంటూ కొర్రీలు పెడుతుంటారు. దీంతో వినియో గదారులు ఆఫీసుల చుట్టూ తిరగలేక ప్రైవేట్ కన్ట్రాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా కాంట్రా క్టర్లు రెట్టింపు డబ్బులు వసూలు చేస్తూ అధికారులు, సిబ్బందికి వాటాలుగా పంచి తమ పబ్బం గడుపు తున్నారు.

జహీరాబాద్ డివిజన్ లో ఉన్న సెక్షన్లలో రెండు, మూడేళ్లకు ఒకసారి అసిస్టెంట్ ఇంజనీర్లు (ఏఈ)లు, సబ్‌డివిజన్ స్థాయిలో అసి స్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు (ఏడీఈ)లు మారడం లేదు అంతే కాదు కాంట్రాక్టర్లు మారడం లేదు. సెక్షన్లలో కొందరు కాంట్రాక్టర్లు పాతుకుపోయి బదిలీపై వస్తున్న ఏఈలను తమకు అనుకూలంగా మార్చు కుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు. కొన్ని సెక్ష న్లలో అధికారులు తమ బంధువుల పేర్లతో ప్రైవేట్ కాంట్రాక్టు పనులు చేయిస్తున్నారు.రాష్ట్ర విధ్యుత్ అధికారులకు ఏమి తెలియదన్నట్లు స్థానిక విధ్యుత్ అధికారులు వ్యవహారిస్తున్నారు. జహీరాబాద్ డివిజన్ లో జరుగుతున్న బాగోతాల వివరాలు సేకరిస్తుంది విజిలెన్స్ అధికారులు, జహీరాబాద్ డివిజన్ పరిధిలోని కొన్ని మండలాల్లో రైతులకు ఇంత అన్యాయం జరుగుతున్న జిల్లా విధ్యుత్ అధికారులు కాని జిల్లా కలెక్టర్ కాని రాష్ట్ర విధ్యుత్ అధికారులు ఎందుకు చూస్తూ ఉరుకుంటున్నారో అర్థం కావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
