Electricity Workers Support Family of Deceased On-Demand Worker
ఆన్ మ్యాన్డ్ అంజి కుటుంబానికి అండగా విద్యుత్ సిబ్బంది
-ఆర్థిక సహాయం అందజేసి ఉదారతను చాటుకున్న విద్యుత్ ఉద్యోగులు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి విద్యుత్ సెక్షన్ లో ఆన్ మ్యాన్డ్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న జన్నే అనిల్ (అంజి) గత మూడు నెలల క్రితం విద్యుత్ విధులు నిర్వహిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగులగా..ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందుతూ..తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాలాడుతూ గత 11 రోజుల క్రితం మృతి చెందాడు. కాగా విషయం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది శుక్రవారం మృతుడు అంజి కుటుంబాన్ని పరామర్శించి, రూ. 27,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి వారి ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ 327 జిల్లా నాయకులు జక్కు రాజేందర్ గౌడ్, పి ఆర్ వి కె ఎస్ జిల్లా నాయకులు గూగులోతు శ్రీనివాస్ నాయక్, ఫోర్ మెన్ యాదగిరి, లైన్ మెన్ లు, మచ్చ సత్యం, శ్రీనివాస్, అనిల్, మోత్కూరి రాములు, ఆర్టీజన్ కార్మికులు, ఆన్ మ్యాన్డ్ కార్మికులు, స్పాట్ బిల్డర్స్ పాల్గొన్నారు.
