నివాస భవనాలను తాకుతున్న విద్యుత్ తీగలు
పొంచి ఉన్న ప్రమాదం
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం మాందారిపేట గ్రామంలో విద్యుత్ స్తంభాలు ఇంటి ఆవరణంలో ఉండడం దానికి తోడు 11 కేవి విద్యుత్ తీగలు పెద్ద పెద్ద భవనాలను అనుకొని ప్రమాదకరంగా ఉండడంతో స్థానికులు భయపడు తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని పిల్లలు ,మహిళలు, పెద్దలు అధిక మొత్తంలో జీవనం సాగిస్తున్నారు ఎటు నుంచి ఏ ప్రమాదం పొంచి ఉందో అని నిత్యం భయాందోళనకు గురవుతున్నారు. 11 కేవి విద్యుత్ తీగల మధ్య నివాసం ఉంటున్న ఇంటికి అడ్డంగా కరెంటు స్తంభాలు ఉండటం వల్ల ప్రజలు తీవ్ర అవస్థల పడుతున్నారు విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ షాక్ గురైన సంఘటన ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని జీవనం సాగిస్తున్నాము .ఏడాదిలో 11కె.వి విద్యుత్ తీగల వల్ల అనేకమంది ప్రజలు కరెంట్ షాక్ కు గురయ్యారు ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్ స్తంభాలను సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసి తమ ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నారు. వారి తప్పిదాలు మాత్రం ప్రజలు గుర్తుచేస్తున్నప్పటికీ విద్యుత్ అధికారులు మాత్రం కనికరం చూపెట్టడంలేదని ప్రజలు వ్యక్తం చేశారు.