పరకాల నేటిధాత్రి
శనివారంరోజున స్పెషల్ కాంపేన్ డే లో భాగంగా 104పరకాల నియోజకవర్గం ఆత్మకూర్ మండలంలోని గూడెప్పాడ్ గ్రామములోని మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో గల 107,108పోలింగ్ కేంద్రాలను హనుమకొండ,జనగాం, వరంగల్,ములుగు మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఎలక్టోరల్ రోల్స్ అబ్జర్వర్‌గా ఆయిషా మస్రత్ ఖానం,ఐఏఎస్,ప్రభుత్వ సంయుక్తకార్యదర్శి,పిఆర్&ఆర్డీ సందర్శించి బూత్ స్థాయి అధికారుల యొక్క ముసాయిదా ఓటర్ జాబితా,బీఎల్వో రిజిస్టర్ లు స్త్రీ,పురుషుల యొక్క ఓటర్ నమోదు వివరాలు పరిలించారు.అనంతరం మాట్లాడుతూ 1జనవరి 2025 నాటికీ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పరకాల రెవెన్యూ డివిజీనల్ అధికారి డాక్టర్ కన్నం.నారాయణ, ఆత్మకూర్ తహశీల్దార్,నాయబ్ తహశీల్దార్(ఎలక్షన్)తదితరులు పాల్గొన్నారు.
107,108 పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎలక్టోరల్ రోల్స్ అబ్జర్వర్ అయిషా మస్రత్ ఖానం,ఆర్డీఓ కె.నారాయణ
