ముందు పరిషత్ ఎన్నికలు మేలు!
`వెనువెంటనే పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని “సీఎం రేవంత” ఆలోచన.
`ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేని సమయం.
`ప్రజా వ్యతిరేకత పెద్దగా లేదు.
`బీఆరఎస్ చేస్తున్న అసత్య ప్రచారాలు జనం నమ్మడం లేదు.
`ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం తగ్గలేదు.
`బీఆరఎస్ ను నమ్మడానికి జనం సిద్ధంగా లేరు.
`బీఆరఎస్, బీజేపీ ల వైరం ప్రజలకు అర్ధమైపోయింది.
`రెండు పార్టీల వల్ల ప్రజలకు ఉపయోగం లేదని తేలిపోయింది.
`కేంద్రం నుంచి బీజేపీ ఎంపీలు నిధులు తెచ్చే శక్తి లేదని తెలిసిపోయింది.
`బీజేపీ నాయకులను ఆ పార్టీ కార్యకర్తలు నమ్మడానికి దైర్యం చేయడం లేదు.
`ఆ పార్టీలో వున్న లుకలుకలు బీఆరఎస్ కు అనుకూలంగా మారక ముందే పరిషత్ ఎన్నికలు నిర్వహించాలి.
`కాంగ్రెస్ శ్రేణులు మంచి ఊపులో వున్నారు.
`ఎన్నికలకు కస్టపడి పనిచేస్తున్నారు.
`పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు.
`గెలుపు బాధ్యతలు నాయకులు, కార్యకర్తలు మోస్తున్నారు.
`వారికి కూడ పదవులోస్తాయన్న నమ్మకం బలపడింది.
`ఇతర పార్టీల నుంచి వలసలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.
`ఆలస్యం అమృతం విషమౌతుంది.
`వేడిలో వేడి ఎన్నికలు పూర్తి చేస్తే గట్టం గడిచిపోతుంది.
`పదేళ్ల తర్వాత పదవులోస్తే పార్టీ మరింత బలపడుతుంది.
`వచ్చే ఎన్నికలకు నాయకులను ఇప్పటి నుంచే సన్నద్ధం చేసినట్లుఔతుంది.
హైదరాబాద్, నేటిధాత్రి:
వేడిగా వున్నప్ప్పుడే ఇనుమును వంచాలి. జనం ఆదరణ వున్నప్ప్పుడే ఎన్నికలకు వెళ్లాలన్న సూత్రాన్ని రేవంత్ సర్కార్ పక్కాగా అమలు చేస్తోంది. వరుసగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వస్తోంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతటి విజయాలను ఆరు నెలల క్రితం ఊహించలేదు. కిందిస్దాయి నుంచి పై స్దాయి దాకా ఆ నమ్మకం కలగలేదు. ఎందుకంటే ప్రతిపక్ష బిఆరఎస్ చేసిన అసత్య ప్రచారాలు బలంగా ప్రజల్లోకి వెళ్లాయన్న భావన కాంగ్రెస్ నాయకుల్లో కనిపించింది. దాంతో స్ధానిక సంస్ధల ఎన్నికలు కావాలని కూడా కాంగ్రెస్ శ్రేణులు ప్రభుత్వం మీద ఒత్తిడి తేలేదు. సరైన సమయం చూసడి ప్రభుత్వం నిర్వహిస్తుందని అనుకున్నారు. డిల్లీ నుంచి కూడ పరిశీలకులు వచ్చి, ఎన్నికల నిర్వహణ మీద నాయకులు,కార్యకర్తలతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు కూడా జరిపారు. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇది అనువైన వాతావరణం కాదనే తేల్చి చెప్పారు. ఆ సమయంలో హైడ్రా దూకుడు కొనసాగింది. పైగా ఎరువుల కొతర తీవ్రంగా వుంది. ఈ రెండు కారణాలు స్దానిక సంస్ధల ఎన్నికల మీద ప్రభావం పడతాయన్న భావన అందరూ వ్యక్తం చేశారు. అనుకోకుండా కాంగ్రెస్‌కు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వరమైంది. ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమి ఖాయమని కాంగ్రెస్ నాయకులు కూడా అనుకున్నారు. ప్రచారం చేయడానికి కూడా పెద్దగా పెద్ద పెద్ద నాయకులే ఆసక్తి చూపలేదు. ఒక్కసారిగా ఎవరూ ఊహించని అభ్యర్దిని సిఎం. రేవంత్‌రెడ్ది తెరమీదకు తేవడం, స్వయంగా ఆయన ప్రచారం నిర్వహించడంతో వార్ వన్ సైడ్ అయ్యింది. అలా మారుతుందని ప్రతిపక్ష బిఆరఎస్ కలలో కూడా ఊహించలేదు. సిఎం. రేవంత్ రెడ్డి వేసిన ఎత్తుల ముందు బిఆరఎస్ చిత్తయిపోయింది. జనంలో వ్యతిరేకత వుందన్న బిఆరఎస్ మాటలకు చెల్లు చీటి రాసింది. ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యమైన విజయం సాదించింది. ఎవరూ ఊహించనంత మెజార్టీ వచ్చింది. దాంతో సిఎం. రేవంత్‌రెడ్డికి మరింత విశ్వాసం పెరిగింది. సర్పంచ్ ఎన్నికలకు వెళ్లారు. ఉప ఎన్నిక గెలుపుతో వున్న కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక్కసారిగాఊపు వచ్చింది. అంతకు ముందు పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేద్దామా లేదా? అన్న డైలమాలో వున్న అనేక మంది నాయకులు తర్వాత ముందుకొచ్చారు. టికెట్ నాకంటే నాకు అని పోటీ పడ్డారు. అంతగా కాంగ్రెస్ పుంజుకున్నది. నిజానికి ప్రజల్లో ప్రజా ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత లేదు. రేవంత్ సర్కారు మీద ప్రజలకు ఎలాంటి అనుమానం లేదు. కాని బిఆరఎస్చేసిన అసత్య ప్రచారం నిజమని కాంగ్రెస్ నాయకులే నమ్మడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్దితి వచ్చింది. జూబ్లీ ఉప ఎన్నికను ఎలా మలుపు తిప్పారో, అలాగే పంచాయితీ ఎన్నికలను కూడాసిఎం. రేవంత్‌రెడ్డి మలుపు తిప్పారు. తాను సిఎంగా వుండి ప్రచారానికి వెళ్లనని అనుకోలేదు. ప్రజల్లోకి వెళ్లారు. సభలు నిర్వహించారు. ప్రజలకు భరోసా కల్పించారు. పంచాయితీ ఎన్నికలను కూడా వార్ వన్ సైడ్ చేశారు. అప్పటికే దెబ్బమీద దెబ్బ పడుతున్న బిఆరఎస్‌కు కోలుకోలేని పరిస్తితి ఎదురయ్యేలా చేశారు. ఎన్నికలంటే బిఆరఎస్ భయం పుట్టేలా సిఎం. రేవంత్‌రెడ్డి ఎన్నికలను నిర్వహిస్తున్నారు. బిఆరఎస్‌ను కోలుకోకుండా చేస్తున్నారు. ఇక ఎన్నికలు అనే పదం బిఆరఎస్ నేతలకు నోటికి రాకుండా చేస్తున్నారు. అంతకు ముందు ఊ అంటే ఎన్నికలకు వెళ్లాలని సవాలు చేసేవారు. పంచాయితీ ఎన్నికల ఓటమి నుంచి బిఆరఎస్ తేరుకోకముందే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. అక్కడ కూడా బిఆరఎస్‌ను చావు దెబ్బ కొట్టారు. పంచాయితీ ఎన్నికలు పార్టీ గుర్తులు కాకపోవడంతో, తమ ఖాతాలో వేసుకున్నారని కాంగ్రెస్‌ను ఆడిపోసుకున్న బిఆరఎస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కూడా దిమ్మతిరిగే సమాధానం చెప్పారు. రేవంత్ సర్కారుకు ప్రజలు అండగా వున్నారని, ఆదరిస్తున్నారని, గెలుపులు అందిస్తున్నారని తేలిపోయింది. నిజానికి జనంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెద్దగా లేదు. కాని అలాంటి వాతావరణం వున్నట్లు ఊహించుకొని అసత్య ప్రచారం చేసుకున్న బిఆరఎస్ ప్లాన్ బూమ్రాంగ్ అయ్యింది. డామిట్ కథ అడ్డం తిరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాదిస్తామని బిఆరఎస్ మళ్లీ పగటి కలలు కని, కారు బోల్తా పడింది. కనీసం పది శాతం చైర్మన్లు కూడ గెల్చుకోలేకపోయంది. ప్రజల్లో ప్రభుత్వం మీదవ్యతిరేకత వుంటే కాంగ్రెస్‌కు ముప్పై నలభై చైర్మన్‌లకన్నా దాటకూడదు. కాని ప్రతిపక్షానికి పట్టు మని ఇరవై చైర్మన్లు కూడా రాలేదు. అంటే ప్రజల్లో బిఆరఎస్‌కు ఆదరణ లేదన్నది తేలిపోయింది. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న తరుణంలోనే పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే ముందు జిహెచఎంసి ఎన్నికలు నిర్వహిస్తారా? లేక పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తారా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి వుంది. ఏ ఒక ఎన్నిక మాత్రం పక్కాగా త్వరలోనే జరుగుతుంది. ఎప్ప్పుడూ ఎన్నికల వాతావరణం వుండేలా చేసి, సరికొత్త రాజకీయ వ్యూహన్ని సిఎం. రేవంత్‌రెడ్డి అమలు చేస్తున్నారు. నిజానికి సర్పంచ్ ఎన్నికలతో పాటు, పరిషత్ ఎన్నికలు కూడా ఏక కాలంలో నిర్వహించేవారు. కాని ఇప్ప్పుడు అదును చూసి, బిఆరఎస్‌ను దెబ్బ మీద దెబ్బ లేవకుండా కొట్టాలంటే కూడా ఎన్నికలను కూడా వ్యూహాత్మకంగా నిర్వహిస్తూ సరికొత్త రాజకీయాన్ని సిఎం. రేవంత్ రెడ్డి రుచి చూపిసున్నారు. బిఆరఎస్ నాయకులకు కళ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నారు. గతంలో ఎన్నికలు, ఎన్నికలు అని కలవరించిన బిఆరఎస్‌కు ఎన్నికలంటేనే చలి జ్వరం వచ్చేలా చేస్తున్నారు. కలలో కూడా బిఆరఎస్ నాయకులు ఎన్నికలంటేనే ఉలిక్కిపడేలా చేస్తున్నారు. ఇదే ఊపులో మెజార్టీ పరిషత్‌ను సొంతం చేసుకునేలా సిఎం. రేవంత్ వ్యూహాలు రచిస్తున్నారు. అయితే తెలంగాణలో పరిషత్‌లను రద్దు చేసే యోచనలో ప్రభుత్వం వుందంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అది ఎంత వరకు వాస్తవం కాదు. ప్రభుత్వం ఒక వేళ ఆ ఆలోచన చేసినా అది సాధ్యమయ్యే పని కాదు. ఒక వేళ అదే ఆలోచన ప్రభుత్వం చేసినా కాంగ్రెస్ నాయకులే ఊరుకోరు. ఏది ఏమైనా పరిషత్ ఎన్నికలు జరగడం అనివార్యం. నిజానికి ఒకప్ప్పుడు రెండంచెల విధానమే వుండేది. దానిని మూడంచెల విధానానికి మార్చిన తొలి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్. దేశంలో ఏ రాష్ట్రంలో లేనప్ప్పుడే మూడంచెల విధానాన్ని తీసుకొచ్చి, దేశానికే ఆదర్శంగా నిలిచింది ఉమ్మడి తెలుగు రాష్ట్రం. అలాంటిది ఇప్ప్పుడు పరిషత్‌లను తొలగించి, రెండంచెల విధానం తీసుకురావడం సాద్యం కాదు. 73 వ రాజ్యాంగ సవరణ ద్వారా తెచ్చిన ఈ విదానాన్ని మార్చే అవకాశం లేదు. 234 అదికరం ప్రకారం 73,74 రాజ్యాంగ సవరణలను మళ్లీ సవరించాల్సి వుంటుంది. అందుకు సాదారణ మెజార్టీ సరిపోదు. రెండింట మూడో వంతు సభ్యుల ఆమోదం పార్లమెంటు తెలిపితే తప్ప మార్చే అవకాశం వుండదు. అయినా ప్రజలకు మెరుగైన పాలన, పాలనా వికేంద్రీకరణల కోసం చేపట్టిన గొప్ప కార్యక్రమం మూడంచెల విదానం. దానిని మార్చడం అంటే మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లడమే అవుతుంది. అలాంటి తిరోగమనం కోరుకోవడం సరైంది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో మూడంచెల విదానం తీసుకొచ్చినప్ప్పుడు ఎంపిటిసిలు, జడ్పీటీసిలు లేదు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ కాలంలో మండల్ పరిషత్ ప్రెసిడెంటును మండల ప్రజలంతా కలిసి ఎన్నుకునేవారు. జడ్పీ చైర్మన్‌ను జిల్లా ప్రజలంతా కలిసి ఎన్నుకునేవారు. దాని వల్ల ప్రతిపక్షాలకు చెందిన నాయకులు ఒక వేళ ఎంపిపిగా, జిల్లా పరిషత్ చైర్మన్లు ఎన్నికైతే ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్దితులు వస్తాయని ఆలోచన చేసి, ఈ రకమైన విదానం తెచ్చారు. అప్పటి నుంచి రెండు గ్రామాలకు ఒక్కరుగా ఎంపిటిసిలు, ప్రతి మండలం నుంచి ఒక జడ్పీటిసిలను ఎన్నుకొని, ఎంపిపిలు, జడ్పీ చైర్మన్లను ఎన్నుకునే విధానం తెచ్చారు. అది కూడా 73,74 రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణ జరుగుతోంది. దానిని ఇప్ప్పుడు తొలగించడం అసాద్యం. గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత బిఆరఎస్ ప్రభుత్వం కూడా ఆలోచన చేసిందన్న వార్తల్లో నిజం లేదు.
