కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు
ముళ్ల పెళ్లి నేటి ధాత్రి న్యూస్
దేశంలో ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి జరుగుతున్న యుద్ధమే జరగబోయే లోక్ సభ ఎన్నికల సమరమని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోలినేని లింగారావు అన్నారు. బుధవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. బిజెపికి టీం లీడర్ నరేంద్ర మోదీ మాత్రమే ఉన్నాడని, కాంగ్రెస్ కు రాహుల్ గాంధీతో పాటు కూటమి రూపంలో అతిపెద్ద ఇండియా టీమే ఉందన్నారు. మొదటి దశ ఎన్నికల అనంతరం మోదీ వెన్నులో వణుకు పుడుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆస్తులన్నీ ముస్లింలకు పంచుతారన్న మోదీ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలన్నారు. పంచ్ న్యాయ్, కులగణన వంటివి బిజెపికి రుచించడం లేదని మండిపడ్డారు. బిజెపి లీడర్లది ఫ్యూడల్ మెంటాలిటీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముని ఫోటో తప్ప మోదీ ఫోటోలతో బిజెపి ప్రచారం చేయడం లేదన్నారు. మోదీ మతతత్వవాది అని..రాహుల్ గాంధీ మానవతావాది అన్నారు. వరంగల్ కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు.