నస్పూర్ నేటిదాత్రి:
నస్పూర్ బల్దియాను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని ఈ రోజు నూతన చైర్మన్ గా సూరిమిల్ల వేణు వైస్ చైర్మన్ గా గెల్లు రజిత యాదవ్ ప్రమాణస్వీకారం చేశారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు హాజరయ్యారు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ ఇంతకు ముందు ఉన్న పాలకవర్గం పనితీరు ఎలా ఉందో నస్పూర్ ప్రజలు చూసారు ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండబోతుందో నస్పూర్ ప్రజలు చూస్తారు అని ప్రతి 3 నెలలకు ఒక్కసారి పత్రిక మిత్రులు తిరిగి అభివృద్ధి చూసి ప్రజలకు తెలియజేయాలని కోరారు, అనంతరం నూతన చైర్మన్ సూరిమిల్ల వేణు మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు కి రుణపడి ఉంటానని ఆయన పరువు ప్రతిష్ట లకు భంగం కలిగించే విదంగా నడుచుకొన్నని అన్నారు తనకు సహకరించిన కౌన్సిలర్లు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు