అధ్యక్షుడుగా గాజుల సతీష్(సాక్షి)..
ప్రధాన కార్యదర్శిగా కొనిశెట్టి మునీందర్ (నేటి ధాత్రి)…
నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ) హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన అధ్యక్ష, కార్యవర్గంను సోమవారం ప్రెస్ క్లబ్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. అధ్యక్షుడిగా గాజుల సతీష్ (సాక్షి దినపత్రిక) ప్రధాన కార్యదర్శిగా కొనిశెట్టి మునీందర్ (నేటిదాత్రి దినపత్రిక)ఎన్నుకున్నారు. వీరితోపాటు ఉపాధ్యక్షులుగా ఒసుకుల డేవిడ్,కనుకుంట్ల శ్రీనివాస్,సహాయ కార్యదర్శిగా కొడెం రమేష్ కోశాధికారిగా మొడెం రాజకుమార్, కార్యవర్గ సభ్యులుగా పబ్బు సతీష్,బాలసాని దేవేందర్,గట్టు రఘు, జక్కు బిక్షపతి,తాల్ల శ్రీనివాస్,గట్టు ఏడుకొండలు,ఉడుత తిరుపతి,ఇజ్జగిరి సంపత్,మౌటం శ్రీనివాస్,కుసుంబ శివాజీ,దాసరి రవీందర్ లను కార్యవర్గ సభ్యులు గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష,కార్యదర్శులు తమ పట్ల అభిమానంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.