
భారతీయ మజ్దూర్ సంఘ్ నూతన జిల్లా కమిటీ ఎన్నిక
మంచిర్యాల జులై19 నేటి ధాత్రి
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ ఆవరణలో శుక్రవారం సాయంత్రం భారతీయ మజ్దూర్ సంఘ్ మాజీ జిల్లా అధ్యక్షులు లగిశెట్టి కమలాకర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేసి భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా పాత కమిటీని రద్దుచేసి, జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన కమిటీని ప్రకటించడం జరిగింది, భారతీయ మజ్దూర్ సంఘ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా కుంటాల శంకర్, జిల్లా కార్యదర్శిగా మద్దూరి రాజు యాదవ్, ఉపాధ్యక్షులుగా కిషన్ రెడ్డి, నీరటి సురేష్, సగ్గుర్తి ఆనందరావు, కోశాధికారి గగ్గూరి విశాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రత్నాకర్ మహానంద్, సహాయ కార్యదర్శుగా, శశి,కొండు రాజేందర్, శాంతం సంపత్, కార్యవర్గ సభ్యులు,కోరకాని తిరుపతి ,కళ,సహజ,లను ఎన్నుకోవడం జరిగింది, భారతీయ మజ్దూర్ సంఘ్ నూతన జిల్లా అధ్యక్షులు కుంటాల శంకర్ మాట్లాడుతూ బి.ఎమ్.ఎస్. జిల్లా అధ్యక్షులుగా నన్ను ఎంపిక చేసిన రాష్ట్ర కమిటీ సభ్యులకు మరియు జిల్లా కమిటీ సభ్యులకు, కృతజ్ఞతలు తెలుపుతూ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా భారతీయ మజ్దూర్ సంఘము (బి.ఎమ్.ఎస్)ను బలోపేతం చేస్తూ కార్మిక హక్కుల సాధన కోసం నా వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమానికి బి.ఎమ్.ఎస్ రాష్ట్ర కార్యదర్శి కంది శ్రీనివాస్, జాతీయ నాయకులు మండ రవికాంత్, కన్స్ట్రక్షన్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ, మరియు జైపూర్ పవర్ ప్లాంట్,దేవాపూర్ పవర్ ప్లాంట్,సింగరేణి బొగ్గుగని కాంటాక్ట్,భవన నిర్మాణ, సంఘటిత, అసంఘటిత కార్మికులకు,పాల్గొన్నారు.