కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కరకగూడెం ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఆదివారం రైతు వేదిక నందు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొనకండ్ల సాయికుమార్, ఉపాధ్యాక్షుడు సయ్యిద్ అప్రోజ్, ప్రధాన కార్యదర్శిగా బుడగం ప్రవీణ్, కార్యదర్శులుగా జాడి విజయ్, కలం సాంబమూర్తి, యాకన్న, క్రీడావిభాగం అధ్యక్షులుగా గుండ్ల రంజిత్, కార్యవర్గ సభ్యులుగా బొల్లికొండ రవి, దుర్గం సురేందర్ జాడీ రాము సునీల్ సాయి గంపల రమేష్ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడు కోనకండ్ల సాయి కిరణ్ మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి ప్రెస్ క్లబ్ కమిటీగా ఎన్నుకున్న ప్రెస్ క్లబ్ సభ్యులకు పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలియజేశారు