మంచిర్యాల నేటి దాత్రి
ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సంజీవయ్య కాలనీ అంబేద్కర్ భవన్ లో మాల మాదిగ నేతకాని మరియు ఉప కులాలకు చెందిన సభ్యులందరూ సమావేశం ఏర్పాటు చేసుకొని అంబేద్కర్ సంక్షేమ సంఘం సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంక్షేమ సంఘం మంచిర్యాల పట్టణ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అంబేద్కర్ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కలగూర లింగయ్య ప్రధాన కార్యదర్శిగా దుర్గం స్వామి వర్కింగ్ ప్రెసిడెంట్ గా సాగే సుమోహన్ ఉపాధ్యక్షులుగా నేరెళ్ల శంకర్ జుమ్మిడి గోపాల్ కోశాధికారిగా పెరిక రవి అధికార ప్రతినిధిగా కుంటాల శంకర్ కార్యదర్శిగా సిర్ర దివాకర్, గౌరవ అధ్యక్షులుగా గడ్డం సత్యం దుర్గం రాజేష్ కాటం రాజేష్ ముఖ్య సలహాదారులుగా రామగిరి బానేష్ గుడిసెల దశరథం ఎలుక పెళ్లి మల్లేష్ సిరికొండ బోస్ లను ఎన్నుకోవడం జరిగింది, నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ అంబేద్కర్ సంక్షేమ సంఘం యొక్క అభివృద్ధి కోసం మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని తెలియజేశారు