శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శాయం పేట గ్రామానికి చెందిన సాధు నాగరాజు ఎన్నికయ్యారు. ఇటీవల నిర్వహించిన పార్టీ అంతర్గత ఎన్నికల్లో ఆయన అత్యధికంగా ఓట్లు సాధించి గెలుపొందాడు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఓట్లు వేసిన యూత్ నాయకులకు కృత జ్ఞతలు తెలిపారు. మండలం లో పార్టీ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకం ఉంచి ఎన్నికకు సహకరించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.