ఏ వై ఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ సాగర్.
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున తెలంగాణా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 23న చిట్యాల,టేకుమట్ల ముండలాల* అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు పుల్లా ప్రేమ్ సాగర్* తెలిపారు,జిల్లా సాంస్కృతిక కార్యాదర్శి జన్నే యుగెందర్ అద్యక్షతన జరిగిన సంఘం సమావేశానికి ముఖ్య అతిథిలుగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య జిల్లా అధ్యక్షుడు పుల్లా ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై, మహిళ లపై రోజు రోజుకు జరుగుతున్న సంఘటనలు ఎదుర్కోవడానికి మండల గ్రామ సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తుమన్నారు . అనివార్య కారణాల వల్ల 18న జరుగవలసిన చిట్యాల మండల కమిటీ ఎన్నిక వాయిదా పడిందని తెలిపారు ఈ నెల 23న చిట్యాల, టేకుమట్ల మండలాల* పరిధిలో ఉన్న గ్రామాల్లోని యువకులు ప్రజలు అంబేద్కర్ వాదులు మేదావులు పత్రిక విలేకరులు ఉద్యోగులు ప్రజా ప్రతినిధులు మిత్రులు చిట్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనం కు రాగలరని అన్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జోగుల రాజు జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ మండల నాయకులు గుర్రం తిరుపతి రాజమొగిలి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.