గణపురం నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మైలారం గ్రామంలో గణపురం మండల అధ్యక్షులు పోతుల విజేందర్ గారి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది
ఇట్టి సమావేశానికి జాతీయ మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెల్ల ప్రభాకర్ ముఖ్యఅతిథిగా పాల్గొని వారు మాట్లాడారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం మాలలు అందరూ కలిసికట్టుగా మన హక్కుల కోసం పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
మైలారం గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములలో అన్ని కుల సంఘాలకు వారి కుల దైవాల కొరకు గ్రామస్తుల సహకారంతో భూమిని కేటాయించుకోవడం జరిగింది.అందుకుగాను తెలంగాణ మాల మానాడు ఆధ్వర్యంలో మాకుల దైవం మాల బేతాళుడు యొక్క ప్రతిష్ట కార్యక్రమం కొరకు మా సంఘానికి కూడా భూమిని కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
అనంతరం మైలారం గ్రామ కమిటీఎన్నుకోవడం జరిగింది.అధ్యక్షులుగా బూర ముక్తేశ్వర్
ఉపాధ్యక్షులుగా పల్లె వెంకన్న ప్రధాన కార్యదర్శిగా బూర కుమారస్వామి
కార్యవర్గ సభ్యులుగా బూర శివశంకర్, బూర సమ్మయ్య, ఏనుగు భాస్కర్, పల్లె రాజు.
ఈ కార్యక్రమంలో జయశంకర్ జిల్లా మాజీ అధ్యక్షులు పసుల అశోక్ రేగొండ మండల అధ్యక్షులు మండల తిరుపతి గోరి కొత్తపల్లి మండల అధ్యక్షులు పసుల రాకేష్ దితరులు పాల్గొనడం జరిగింది.
మైలారంలో మాల మహానాడు గ్రామ కమిటీ ఎన్నిక
