పి.వై.ఎల్ .రాష్ట్ర మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా గుమ్మడి నర్సయ్య ఎన్నిక

 

మహబూబాబాద్,నేటిధాత్రి:

దేశంలో ప్రజాస్వామిక హక్కులకు,ప్రజల ఐక్యతకు,దేశ లౌకిక వ్యవస్థకు,పెను ప్రమాదకరంగా మారుతున్న కుల,మతోన్మాద ఫాసిజాన్ని ప్రతిఘటిస్తూ కొనసాగుతున్న ప్రగతిశీల ఉద్యమాల్లో యువత క్రియాశీలక భాగస్వాములు కావాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పిలుపునిచ్చారు.శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో ప్రగతిశీల యువజన సంఘం (పి.వై.ఎల్) తెలంగాణ రాష్ట్ర 8వ మహాసభల నిర్వహణకై ఆహ్వాన సంఘం ఏర్పాటు సమావేశం పి.వై.ఎల్.రాష్ట్ర ఉపాధ్యక్షులు వాంకు డోతు అజయ్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ అధికార గద్దెనెక్కినప్పటినుండి దళిత,గిరిజన,బడుగు,బలహీన,అట్టడుగు ఆదివాసి వర్గాలపై బిజెపి ముసుగులో ఉన్న ఆర్ఎస్ఎస్,సంఘ్ పరివార్ శక్తులు కులం,మతం,సనాతన ధర్మం పేరిట దాడులు,దౌర్జన్యాలు,హత్యలు యదేచ్చగా కొనసాగిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.దేశంలో భిన్నత్వంలో ఏకత్వంలా కలిసిమెలిసి జీవిస్తున్న ప్రజల మధ్య మోడీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారపీఠం
ఎక్కాలనే వక్రబుద్ధితో కుల,మత,జాతి వైశామ్యాలు రెచ్చగొట్టడంతో ప్రపంచ దేశాల ముందు భారతదేశ పరువు ప్రతిష్టలు దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.కేంద్రంలో మోడీ ప్రభుత్వం గత ఎన్నికల ముందు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వకుండా ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడమే కాకుండా,విద్యార్థి,నిరుద్యోగ యువతకు విద్యా,ఉద్యోగ ఉపాధి,అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని తీవ్రంగా ఆక్షేపించారు.ప్రజల ప్రజాస్వామిక హక్కులను,ప్రశ్నించే గొంతులను రక్షించలేని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.దేశాన్ని మతోన్మాద ఫాసిజం నుండి రక్షించుకునేందుకు యువత ప్రగతిశీల బాబాజాల వ్యాప్తి ఉద్యమాల్లో క్రియశీలక భాగస్వాములు కావాలని కోరారు.అనంతరం పి.వై.ఎల్. రాష్ట్ర 8వ మహాసభల విజయవంతనికి ప్రజలు, ప్రజాస్వామిక వాదులు,హక్కుల కార్యకర్తలు,మేధావులు,పుర ప్రముఖులు,ప్రజా సంఘాల నాయకులతో కలిపి ఆహ్వాన సంఘం ఏర్పాటు జరిగింది.ఈ ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర కార్యదర్శి కె.ఎస్. ప్రదీప్,కోశాధికారిగా సిపిఐ (ఎం.ఎల్ )ప్రజాపంథా జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి లను ఎన్నుకున్నారు.వీరితో పాటు ఉపాధ్యక్షులు గా ప్రొఫెసర్ హరగోపాల్,ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ,కాశీనాథ్ లతో పాటు సహాయ కార్యదర్శులు గా నాగిరెడ్డి, ప్రొఫెసర్ చక్రధర్,కె.నారయణ లతో పాటు150 మంది సభ్యులను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో *సిపిఐ( ఎమ్.ఎల్) ప్రజా పంథా మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి చంద్రన్న, రాష్ట్ర నాయకులు పి.హన్మేష్, పి.వై.ఎల్. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్. ప్రదీప్,రాష్ట్ర నాయకులు ఎన్ వి రాకేష్,భరత్,మోహాన్ రెడ్డి,జిల్లా అధ్యక్షులు ఇరుగు అనిల్ ప్రధాన కార్యదర్శి పైండ్ల యాకయ్య,విప్లవ ప్రజా సంఘల నాయకులు ముంజంపల్లి వీరన్న,బిల్ల కంటి సూర్యం,బండ పెళ్లి వెంకటేశ్వర్లు, ఈరెల్లి మల్లేష్, షరీఫ్,బి. నరసింహ రావు, అలువాల నరేష్,జావీద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *