భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ గా గండ్ర హరీష్ ఎన్నిక

మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన బిఆర్ఎస్ పార్టీ.

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపాలిటీ, మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి గండ్ర హరీష్ రెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న 16 మంది కౌన్సిలర్ సభ్యులు.
గతంలో బీ ఆర్ ఎస్ పార్టీ తరుపున ఎన్నికైన వైస్ చైర్మన్ కొత్త హరిబాబు రాజీనామాతో ఏర్పడ్డ ఖాళీ.
30 మంది కౌన్సిలర్ లతో పాటు ఎక్స్ అఫిషియో మెంబర్ గా ఎమ్మేల్యే వ్యవహరించనున్నారు
4గురు కో ఆప్షన్ సభ్యుల తో కలిపి మొత్తం 34 మందితో కొలువుదీరిన భూపాలపల్లి మున్సిపాలిటీ పాలక వర్గం.
ఏలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ పోలీసు బందోబస్తు నడుమ భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ గా గండ్ర హరీష్ రెడ్డి ఎన్నిక జరిగింది.
ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఏక్స్ ఆఫీసియో అభ్యర్థి అయిన ఎమ్మెల్యే సరైన బలం నిరూపించుకోలేక ఈ ఎన్నిక కు హాజరు కాలేదు.
బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు 16 మంది గండ్ర హరీష్ రెడ్డి ని వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అనంతరం ప్రమాణ స్వీకారం చేసి,ఎన్నికల హాల్ నుండి వచ్చిన కౌన్సిలర్లు అంబేద్కర్ కి జయశంకర్ విగ్రహాలకు పూల మాల వేసి అక్కడి నుండి బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ
ఈ కష్టకాలంలో ఎంత మంది ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన, ఇబ్బందులు,బెదిరింపులు చేసిన వాటి అన్నిటినీ ఎదుర్కొంటు నా వెంట ఉండి, పార్టీ బలోపేతానికి పనిచేస్తూ భూపాలపల్లి మున్సిపాలిటీ పురపాలక సంఘ వైస్ చైర్మన్ పదవిని బి ఆర్ ఎస్ పార్టీ కి కానుకగా ఇచ్చిన మన కౌన్సిలర్లకు, సహకరించిన పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, అభినందనలు
మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన గండ్ర హరీష్ రెడ్డి కి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ,శాలువా తో సత్కరించారు.ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!