CSI School Alumni Form Ad-Hoc Committee
సిఎస్ఐ పాఠశాల అభివృద్ధి కోసం ఆడహాక్ కమిటీ ఎన్నిక
పూర్వ విద్యార్థుల కృషిని అభినందించిన పాఠశాల కరస్పాండెంట్ రమాజ్యోతి
పరకాల,నేటిధాత్రి
చదువుకున్న పాఠశాలను కాపాడుకోవడం కోసం పూర్వ విద్యార్థులంతా ముందుకు రావడం చాలా గర్వంగా ఉందని సీఎస్ఐ మిషన్ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ రమా జ్యోతి అన్నారు.సీఎస్ఐ మిషన్ ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం సిఎస్ఐ మిషన్ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ రమాజ్యోతి అధ్యక్షతన సోమవారం పూర్వ విద్యార్థులు సమావేశం కావడం జరిగింది.ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం సిఎస్ఐ కరీంనగర్ అధ్యక్ష మండల మేనేజ్మెంట్ కు లోబడి పాఠశాల అభివృద్ధి కార్యచరణ రూపొందించడం కోసం పూర్వ విద్యార్థుల నుంచి తాత్కలిక అడహక్ కమిటీని వేయడం జరిగింది. అడ హక్ కమిటీ చైర్మన్ గా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎబ్బి,ముఖ్య సలహాదారులుగా కే.జే థామస్,జేమ్స్,సిఎస్ఐ కరీంనగర్ అధ్యక్ష మండల మేనేజ్మెంట్కు ఎక్స్ అఫీషి యో ( ప్రత్యేక హోదా )గా పరిగణంలోకి తీసుకుంటూ ఆడహాక్ కమిటీ కన్వీనర్ గా ఒంటేరు ప్రభాకర్,కోకన్వీనర్ గాకాజీపేట రవీందర్,సెక్రటరీగా చొల్లేటి సునేందర్,కోశాధికారిగా బి.అశోక్, సలహాదారుడుగా ఒంటేరు చక్రి,కన్స్ట్రక్షన్స్ కన్వీనర్స్ గా బొచ్చు కళ్యాణ్, పాలకుర్తి తిరుపతిలను ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ ఒంటేరు ప్రభాకర్ మాట్లాడుతూ 1948 సంవత్సరంలో స్థాపించి 77 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు విద్యా ద్వారా తోడ్పాటు అందించిన సీఎస్ఐ మిషన్ ఉన్నత పాఠశాల పూర్వవైభవమే పూర్వ విద్యార్థులు కృషి చేయాలని ఐక్యతగా స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది అన్నారు.2026 -27 విద్యా సంవత్సరంలోపు సి ఎస్ ఐ మిషన్ ఉన్నత పాఠశాల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా కార్యచరణ రూపొందించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. పాఠశాల అభివృద్ధికి నిధుల సేకరణ జరగాలంటే ప్రతి ఎస్ఎస్సి బ్యాచ్ వారందరినీ వాట్సప్ గ్రూపులో యాడ్ చేస్తూ కమిటీ తీసుకున్న నిర్ణయాలను పనులను తెలియజేస్తూ నిధులను సేకరించడం జరుగుతుందన్నారు.ఆయా నిధులను బ్యాంకు అకౌంట్ తీసి అందులో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. కాబట్టి సిఎస్ఐ పూర్వ విద్యార్థులు ఎక్కడ ఉన్నా ఎంతటి హోదాలో ఉన్న పాఠశాల అభివృద్ధి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.అదేవిధంగా
వచ్చే నెల డిసెంబర్ 7న 11 గంటలకు అడహక్ కమిటీ సమావేశమై పాఠశాల అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులపై కార్యచరణ రూపొందించడం జరుగుతుందన్నారు.ఈ సమావేశంలో పాఠశాల పూర్వ విద్యార్థులు ఒంటేరు చంద్రశేకర్,బొచ్చు అనంతరావు,ఒంటేరు మధు, బొచ్చు శ్రీనివాస్,పాస్టర్ బొచ్చు ప్రకాశం తదితరులు పాల్గొన్నారు.
