పద్మశాలి కుల సంఘo నూతన కమిటీ ఏకగ్రీవం
పద్మశాలి సభ్యుల సమక్షంలో ఎన్నిక
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. పద్మశాలి కుల బంధువులందరికీ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ పద్మశాలి కమిటీ సభ్యులందరి సహకారాలతో కలిసికట్టుగా పనిచేస్తే సంఘం అభివృద్ధి చెందుతుంది. నూతన అధ్యక్షుడిగా బాసని ప్రకాష్, ఉపాధ్యక్షుడు మామిడి మారుతి,తుమ్మ ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి మంత్రి రాజు, సహాయ కార్యదర్శి బాసని నవీన్ బత్తుల రాజేష్ , కోశాధికారిగా గొట్టుముక్కుల రమేష్ ,ప్రచార కార్యదర్శిగా బాసని బాల కృష్ణ,సభ్యులు ,కడారి చంద్రమౌళి, బత్తుల శ్రీధర్ కందగట్ల గోపాల్, పసునూటి తిరుపతి, చల్ల శ్రీనివాస్ బాసని శ్రీనివాస్, దుబాసిరవి, బాసని లక్ష్మణమూర్తి ఎన్నుకున్నారు.