శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలంలోని మాందారిపేట్ క్రాస్ రోడ్ వద్ద సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో శాయంపేట రూరల్ సీఐ డీ. మల్లేష్, శాయంపేట ఎస్సై దేవేందర్ పోలీస్ సిబ్బంది మరియు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (ఆర్మీ )బలగాలతో ఆకస్మిక వాహన తనిఖీలు చేస్తుండగా సిద్ధంశెట్టి.నితిన్ వరంగల్ అను అతను టూ వీలర్ బండి పై హనుమకొండ నుండి పరకాల వైపు వెళుతుండగా తనను ఆపి తన బ్యాగును చెక్ చేయగా ఎలక్షన్ కోడ్ కు విరుద్ధంగా ఎలాంటి పత్రాలు లేకుండా 97000/- వేల రూపాయలు నగదు తీసుకొని వెళుతుండగా డబ్బులను సీజ్ చేసి భూపాలపల్లి రిటర్నింగ్ ఆఫీసర్ అధికారికి అప్పగించనైనది.