తంగళ్ళపల్లి నేటి దాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కి కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఆయన ఎంపీగా ఉన్న సమయంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని కరీంనగర్ నియోజకవర్గం రైలు సౌకర్యం గాని స్మార్ట్ కరీంనగర్ సిటీ గాని నియోజకవర్గం లో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని అటువంటి విద్యావంతుడు మేధావంతుడు అయినా వినోద్ కుమార్ కి కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఓటర్లు అభ్యర్థించి కోరారు ఇట్టి కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు