తంగళ్ళపల్లి నేటి ధాత్రి..
తంగళ్ళపల్లిమండల కేంద్రంలో బీడీ ప్యాకింగ్ కార్మికులు కలవడంతోపాటు వారిని ఓటు అభ్యర్థించారు ఈ సందర్భంగా వెంగళ శ్రీనివాస్ బీడీ కార్మికుల స్థితిగతులు తెలుసుకొని వారి సంక్షేమానికి పెద్దపీట వేసి నెలకు 2016 రూపాయల జీవన భృతి కల్పించడం జరిగిందని కానీ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బీడీ పరిశ్రమలపై 18 శాతం జీఎస్టీతో విధించడంతో పరిశ్రమపై పుర్రె ఎముకల గొంతు డేంజర్ మార్కు గుర్తులను ముద్రించాలని అనేక ఆకాంక్షలు విధించడం వల్ల ఆరు రోజుల నుండి 10 రోజుల వరకు మాత్రమే పని నడుస్తుందని మిగిలిన రోజులు కార్మికులు పస్తులు ఉండేపరిస్థితి దాపురించిందని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్డర్లు వస్త్ర పరిశ్రమకు రాక నేతన్నలకు ఉపాధి కరువైందని తెలంగాణ ప్రాంతంలో దాదాపు 8 లక్షల మంది కార్మికులు బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు లేకుండా పిఎఫ్ కలిగిన కార్మికులకు జీవన భృతి ఇవ్వాలని ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కార్మికులకు ఉపాధి దెబ్బతీసిన బిజెపి కాంగ్రెస్ పార్టీలకు ఈ పార్లమెంటు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కార్మిక సంక్షేమ కోసం ఎంతో కృషి చేసిన బి.ఆర్.ఎస్ పార్టీకి అండగా నిలిచి కారు గుర్తుకు ఓటు వేసి కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా వినోద్ కుమార్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వారిని కోరారు ఇట్టి కార్యక్రమంలో కొప్పుల ప్రసాద్ జిందం మల్లేశం రమేష్ నాంపల్లి రామస్వామి బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు
బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం.
