
నడి కూడ,నేటి ధాత్రి:
పరకాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు వరంగల్ ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల సందర్బంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కి సీరియల్ నెంబర్ 3లో మొదటి(1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నడికూడ మండల కేంద్రంలో నడికూడ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి(చందు) ఆధ్వర్యంలో పట్టభద్రులని కలిసి ప్రచారం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో నడికూడ గ్రామ మాజీ సర్పంచ్ ఊర రవీందర్ రావు,నడికూడ పట్టభద్రుల గ్రామ ఇంచార్జిలు సంఘని వేణు,రావుల కిషన్, గొడిశాల రంజిత్ కుమార్, మొర్రి సారయ్య,రమేష్ వంశీ,ప్రశాంత్ మరియు బిఆర్ఎస్వి జిల్లా కో ఆర్డినేటర్ పోచంపల్లి రఘుపతి,నడికూడ మండలం క్లస్టర్ ఇంచార్జిలు దురిశెట్టి వెంకటేష్,సురాబు శ్రీకాంత్, గుడికందుల శివ,దోమ పవన్, బిఆర్ఎస్ నాయకులు రమేష్ శ్రీనివాస్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.