జడ్చర్ల నియోజకవర్గం లో కారు జోరు.
బాలానగర్ మండలం హేమాజిపూర్ లో ఎన్నికల ప్రచారం..
> ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.
> అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్తులు_
మహబూబ్ నగర్ జిల్లా ;; నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం
ప్రచారంలో భాగంగ ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్లు ,ఉచితంగా మంచినీరు అందరికి అందుతున్నాయా అని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అడిగి తెలుసుకున్నారు.
జడ్చర్లలో బి, ఆర్, ఎస్, పార్టీనీ అధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు
ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత మాజీ మంత్రి,ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేస్తున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ పథకాలు వల్ల తమ కుటుంబాలకి రైతు బంధు, కల్యాణ లక్ష్మీ, వృద్దులకి అసరా పెన్షన్ లు వస్తున్నాయన్నారు_ .
_బి, ఆర్, ఎస్, ప్రభుత్వం వచ్చాక తమ జీవితాల్లో వెలుగులు నింపారని ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కెసీఆర్, బి, ఆర్, ఎస్, ప్రభుత్వానికి మా గ్రామ ప్రజలందరూ పూర్తి మద్దతు గా ఉంటామని హామీ ఇచ్చారు.
> కంటి ముందు సంక్షేమం, అభివృద్ధి ఇంటి ముందు అభ్యర్థి..
ప్రస్తుత పథకాలను కొనసాగించడంతో పాటు… అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రూపొందించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టో
కారు గుర్తుకు ఓటేద్దాం…మన తెలంగాణలో సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగిద్దాం..!
> జడ్చర్ల కేంద్రంలో.
జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత చర్లకోల లక్ష్మారెడ్డి గెలుపు కోసమై జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో 11వ వార్డులోని ప్రజలకు ఇంటింటికి తిరిగి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలొని పథకాలను వివరించి ప్రభుత్వం చేసినటువంటి పనులను వివరిస్తూ మరల మన ప్రభుత్వం వస్తే ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బి జ్యోతి కృష్ణారెడ్డి బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు మాలిక్ షాకీర్ శేఖర్ రెడ్డి శ్రీకాంత్ రఘునందన్ రెడ్డి కాలనీలోని మహిళలంతా పాల్గొనడం జరిగింది..
> మిడ్జిల్ మండలంలో.
దోనూరు గ్రామంలో లక్ష్మారెడ్డి కి మద్దతుగా జిల్లా మండల నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిచిన ఎంపీపీ బరిగెల సుదర్శన్,ఈసందర్బంగా మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమలు వివరిస్తూ బి, ఆర్, ఎస్, మేనిపెస్టోను ప్రజలకు తెలియజేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మోసపురిత హామీలను ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరు అని అన్నారు 3వ సారి లక్ష్మారెడ్డి కి భారీ మెజారిటీ అందించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల నాయకులు శ్రీనివా స్ గుప్త,జైపాల్ రెడ్డి,జగన్ గౌడ్.చెన్నరవికుమార్,మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, నవీన్ చారి.దోనూరు గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
> వెలుగోమ్మల
వెలుగొమ్మల్ల గ్రామంలో గడపగడపకు బి ఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో పథకాలు ప్రజలకు తెలపడం కోసం బయలుదేరిన బి ఆర్ఎస్ పార్టీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు జంగారెడ్డి మాజీ బిఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి మిడ్జిల్ గ్రామ సర్పంచ్ రాధిక వెంకట్ రెడ్డి మిడ్జిల్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సత్యం గుప్తా మిడ్జిల్ మండల్ యూత్ వింగ్ అధ్యక్షుడు పట్న బంగారు కొత్తూరు మాజీ సర్పంచ్ కృష్ణ.మండల నాయకులు బాబా రఘుపతి రెడ్డి మోహన్ రెడ్డి బాల్ రెడ్డి శేఖర్ రెడ్డి మద్ది బాల్ రెడ్డి కృష్ణారెడ్డి హుస్సేన్ ప్రేమ్ కుమార్ పరిషరాములు శ్రీనివాసులు తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు…
> నవాబుపేట మండలంలో
> యన్మన్ గండ్లలో ఇంటింటికీ కేసీఆర్ ప్రవేశ పెట్టిన మేనిఫెస్టో..
> లక్ష్మన్నను హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చేసి సరికొత్త రికార్డు సృష్టిస్తాo..
జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండల పరిధిలోని యన్మన్ గండ్ల గ్రామంలో రంజిత్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సిఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.కారు గుర్తుకు ఓటేసి సీఎం కేసీఆర్ ను హ్యాట్రిక్ సిఎంగా,మరోసారి మన జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత,జనహృదయనేత శ్రీ సి .లక్ష్మారెడ్డి ని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు కమిటీ సభ్యులు,బి, ఆర్, ఎస్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.