
గంగాధర నేటిధాత్రి :
గంగాధర మండలం లక్ష్మి దేవిపల్లి గ్రామం లో ని నరేంద్ర విద్యాలయం లో పాఠశాల యాజమాన్యం జి. రాజేశం, గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలోవిద్యార్థుల కు మోడల్ ఎలక్షన్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా విద్యార్థుల చే హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ఎన్నిక చేశారు. దీనితో పాటు విద్యార్థుల ఆట దుస్తుల అదారంగా రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో హౌసెస్ లీడర్స్ ను ఎన్నిక చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ విద్యార్థుల కు లీడర్ షిప్ విధానం ఈ ఎన్నికల ద్వారా అర్థము చేసుకున్నారని అన్నారు. చదువుతో పాటు అన్నిరంగాలలో విద్వార్తులను ముందుంచుతున్నామని అన్నారు. విద్యార్థుల కు విద్యతో పాటు బాధ్యత తెలుకుంటారని తెలిపారు. విద్యార్థులు ఉత్సాహం గా మోడల్ ఎన్నికల్లో ఓట్లు వేసే కార్యక్రమం లో పాల్గొన్నారు. స్కూల్ హెడ్ భాయ్ గా ఓంకార్, హెడ్ గర్ల్ గా శ్రీజ ఎన్నిక అయింది. క్రమశిక్షణ, ఇంగ్లీష్ లో మాట్లాడించడం, వంటి విషయాలు ఈ లీడర్స్ ఆయా హౌస్ లో శ్రేద్ద తీసుకుంటారన్నారు.ఈ కార్యక్రమం లో అధ్యాపకులు పాల్గొన్నారు.