
కోతుల దాడితో వృద్ధురాలికి తీవ్ర గాయాలు
నెక్కొండ ,నేటి ధాత్రి:
నెక్కొండ మండలంలోని చంద్రుగొండ గ్రామంలో వానర సైన్యం దాటికి వృద్ధురాలికి తీవ్ర గాయాలు కావడంతో వృద్ధురాలి కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనలతో చంద్రుగొండ ప్రజలు కోతుల భయంతో గజ గజ వనక పోతున్నారు. వివరాల్లోకి వెళితే చంద్రుగొండ గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసముంటున్న బక్కి లక్ష్మి(60) శనివారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఇంటి పనులు చేస్తుండగా అటుగా వచ్చిన వానర సైన్యం ఒక్కసారిగా లక్ష్మిపై దాడి చేయడంతో లక్ష్మికి తీవ్ర గాయాలు కావడంతో లక్ష్మిని వెంటనే కుటుంబ సభ్యులు నెక్కొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యుల సూచన నిమిత్తం ఎం జి ఎం కు తరలించినట్టు లక్ష్మి కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం లక్ష్మీ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ చంద్రుగొండ గ్రామంలో ఎప్పుడూ లేని విధంగా కోతులు ఇండ్లలోకి దూరి విధ్వంసం సృష్టిస్తున్నాయని చంద్రుగొండ గ్రామంలో చాలామందిని కరిసాయని వెంటనే ఉన్నత అధికారులు స్పందించి కోతుల బెడద నుండి కాపాడాలని అన్నారు.