ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల గ్రామానికి చెందిన చింతం లక్ష్మి వయసు 74 భర్త పేరు చంద్రయ్య వయసు 80 తన ఆరోగ్యపరంగా బాగా లేకపోవడంతో నిత్యం ఇంట్లో ఏదో రకమైన ఇబ్బందులను భరించలేక శుక్రవారం ఐదు గంటలకు లేచి నాగులకుంట వెనకాల ఉన్న బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. వెనకాలనే ఆమెను గమనించుకుంటూ వచ్చిన గ్రామస్తులు ఆమె అందులో పడగానే ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుంట పోయిందని గ్రామస్తులు తెలిపారు.వెంటనే పొత్కపల్లి ఎస్ఐకి సమాచారం అందడంతో సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టి మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏ ఎస్ ఐ లక్ష్మీ రాజం గౌడ్ తెలిపారు.