తంగళ్ళపల్లి నేటి దాత్రి…
తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో ప్రభుత్వ వయోవృద్ధులు ఆశ్రమం వృద్ధులు సహాయ వెల్ పర్స్ అసోసియేషన్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తూ ప్రభుత్వ ఆశ్రమంవృద్ధులను మరియు ఎల్లారెడ్డిపేట కేర్ సెంటర్ మరియు వృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులను గౌరవ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజ్యం గారి సహకారంతో కొండగట్టు లోని ఆంజనేయస్వామి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం అందరితో కలిసి వన భోజనాలు చేసినారు ఈ సందర్భంగా వృద్ధులు అందరు సంతోషం వ్యక్తపరిచారు అలాగే ఇంత మంచి కార్యక్రమానికి కృషి చేసిన జిల్లా కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో వృద్ధుల ఆశ్రమం కోఆర్డినేటర్ ఎం మమత అసిస్టెంట్ కోఆర్డినేటర్ వెంకటేష్ మరియు స్థానిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు