ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర కన్వీనర్ హకీమ్ నవీద్
హన్మకొండ, నేటిధాత్రి :
ఏకశిల యాజమాన్యం యొక్క ఒత్తిడి వల్ల ఆ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎం.పీ.సీ మొదటి ఇయర్ చదువుతున్న గుగులోతూ శ్రీదేవి అనే విద్యార్థి మానసికంగా కుంగిపోయి అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా బాధపడుతున్న కనీసం ఆ విద్యార్థి కి వైద్యం అందించకుండా ఏకశీలా యాజమాన్యం నిర్లక్ష్యం చేయడం వలన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది ఏ.ఐ ఎస్.బి రాష్ట్ర కన్వీనర్ హకీమ్ నవీద్ ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి హాస్టళ్లకు సంబంధించిన అనుమతులు లేకున్నా అనధికారికంగా జిల్లాలో ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారి పరోక్ష సహకారంతో జిల్లాలో ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వానిబంధనను తుంగలో తొక్కి ఇష్టరాజ్యాంగ వ్యవహరిస్తున్న ఆయన ఆరోపించారు ఈ ఆరు నెలల వ్యవధిలో హనుమకొండ జిల్లాలో ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన అన్నారు కావున ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇట్టి విషయంపై స్పందించి విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా గుగులోతూ శ్రీదేవి అనే విద్యార్థి మృతికి కారకులైన యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ అనధికారికంగా కళాశాల హాస్టల్ నిర్వహిస్తున్న ఏకశీలా కళాశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.