Munira Begum Sultan Appeals for Caste-Free Development
ఈదులపల్లి గ్రామ ఇండిపెండెంట్ అభ్యర్థి మునిరా బేగం సుల్తాన్ సలావుద్దీన్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఈదులపల్లి గ్రామంలో ప్రజలు నాకు సర్పంచ్ గా అవకాశం ఇస్తే కుల మాతలకు అతీతంగా పాలన అందిస్తానని, అభివృద్ధి తమ అభిమతం అని, కొందరు స్వార్ధం కోసం అవకాశావద రాజకీయాలు చేస్తున్నారని ఈదులపల్లి గ్రామ ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి మునిరా బేగం సుల్తాన్ సలావుద్దీన్ అన్నారు. మంగళవారం నాడు ఝరాసంగం మండలంలోని ఈదులపల్లి ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మునిరా బేగం సుల్తాన్ సలావుద్దీన్ ఒక్కసారి అవకాశం ఇచ్చి గ్రామ ప్రజలు నాకు అధికారం కట్టబెడితే గ్రామంలో పేదరికం లేకుండా చేయడమే నా లక్ష్యం అన్నారు. గ్రామ అభివృద్ధికి గతంలో అందరి సహకారంతో తోడ్పాటు అందించానని, తనను సర్పంచ్ గా ఎన్నుకుంటే రాబోయే రోజుల్లో గ్రామాన్ని పట్టణన్ని తలపించేలా అభివృద్ధి చేసి చూపిస్తానని, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో ఈదులపల్లి గ్రామాన్ని అభివృద్ధిలో నిలబెడతామాని, గ్రామంలో ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అర్హులైన లబ్దిదారులకు అందించే బాధ్యత తమదే అని,కావున గ్రామ ప్రజలు కులమతలకు అతీతంగా తమకు ఓటు వేసి గెలిపించి గ్రామ అభివృద్ధి కోసం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
