భారీ వర్షానికి కూలిన ఈద్గా ప్రహరీ గోడ,
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండల మాద్రి గ్రామంలో కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోతగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే భారీ వర్షాలకు కురుస్తున్న భారీ వర్షాలతో 15 ఏళ్ల క్రితం కట్టిన ఈద్గా ప్రహరీ గోడ కూలిపోయింది.గోడ కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణహానీ జరగలేదు. అయితే ఈద్గా పరిసర ప్రాంతాలకు తీవ్రంగా నష్టం ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు.తక్షణమే స్పందించి పునర్నిర్మానం చేపట్టాలని స్థానికులు కోరారు.