అభిశంసన దిశగా అడుగులు..?

`ఈసిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని ఇండియా కూటమి ఆలోచన!

`ఛీఫ్‌ ఎలక్షన్‌ కమీషనర్‌ తొలగింపు సాధ్యమా?

`అంత బలం ప్రతిపక్షాలకు వుందా?

`2/3 మెజారిటీ లేకుండా సాధ్యం కాదు!

`అయినా ప్రతిపక్షాలు ముందుకు?

`సహజంగా రాజ్యాంగ బద్ద పదవుల్లో వున్న వారిని ప్రశ్నించేందుకు వున్న ఏకైక వెసులుబాటు?

`ఎన్నికల కమీషన్‌ మీద పార్లమెంటు సాక్షిగా విసృత చర్చ జరగాలంటే ఇదొక్కటే మార్గం.

`ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నది ప్రతిపక్షాల నిర్ణయం!

`ప్రతిపక్షాలు అడిగినంత సమయం ఇవ్వాల్సి వుంటుంది!

`బిజేపి పార్టీ కూడా తన వైఖరిని చెప్పాల్సి వస్తుంది!

`నిజంగానే అనుమానాల నివృత్తికి ఒక అవకాశం దొరుకుతుంది!

`పార్లమెంటు ముందుకు అన్ని వివరాలు చేర్చాల్సి వుంటుంది?

`ప్రతి పక్ష నేత రాహుల్‌ ఆరోపణలు నిజమా! కాదా కూడా తేలిపోతుంది.

`పార్లమెంటులో జరిగే విసృత చర్చ వల్ల ఎన్నికల కమీషన్‌ పరిధి కూడా ప్రజలకు తెలుస్తుంది.

`ఎన్నికల కమీషన్‌ కూడా సమాధానం దాట వేసే పరిస్థితి లేకుండా పోతుంది.

`ప్రభుత్వం కూడా అందుకు అన్ని రకాల వివరణలు ఇవ్వాల్సిన అగత్యం ఏర్పడుతుంది!

హైదరాబాద్‌,నేటిధాత్రి:
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మనది. ప్రజలే ప్రజలకోసం, ప్రజలు ఎన్నుకొని, ప్రజలే పాలించుకునే ప్రజాస్వామ్యపాలన మనది. అలాంటి మన దేశ పాలనలో అన్ని పారదర్శంగానే వుండాలి. ముఖ్యంగా ఎన్నికల విధానం అనేది అత్యంత పాదర్శకంగా, నిబద్దతగావుండాలి. కాని అనుమానాలను మరుగున పర్చడమో, ప్రశ్నించిన వారికి ప్రశ్నలే సమాదానమో కాదు కావాల్సింది. సహజంగా రాజకీయాలలో పార్టీల మధ్య వివాదాలు వుంటాయి. కాని కొత్తగా మన దేశంలో ఎన్నికల సంఘానికి, రాజకీయ పార్టీలకు మధ్య వివాదం మొదలైంది. గతంలోనూ ఓసారి ఇలాంటి పరిస్ధితి వచ్చింది. ప్రధాన మంత్రి పవి. నర్సింహారావు హాయాంలో ఎన్నికల కమీషన్‌ కట్టడికి ప్రయత్నాలు జరిగాయి. కాని అప్పటి ఎన్నికల ప్రధాన కమీషనర్‌ శేషన్‌ రాజకీయ పార్టీల పప్పులు ఉడకన్విలేదు. అంటే ఎన్నికల సంఘం అంత నిబద్దతగా వుండాలి. కాని ఇప్పుడు ఎన్నికల సంఘం ప్రకటనలు ప్రజలను కూడా ఆశ్చర్యపోయేలాచేస్తున్నాయి. ఎన్నికల సంఘం చేయాల్సిన విధులను, ప్రజలకు వివరించి చెపాల్సిన బాద్యత కూడా వుంది. కాని తాము చేసే వాటిపై రాజకీయ పార్టలకు కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేనట్లు మాట్లాడడాన్ని ప్రజలు స్వాగతించడం లేదు. నిజంగానే ఎన్నికల సంఘం పారద్శంగా వుంటే వాటిని గురించి వెల్లడిరచడంలో ఇబ్బందులు ఎందుకు? అంటే ఎక్కడో ఏదో జరిగిందన్న మాట ఎన్నికల కమీషన్‌ దృష్టికి వచ్చినట్లా? లేదా ఎన్నికల కమీషనే ఏదైనా చేసిందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. అందుకే ఓ వైపు ఓట్‌ చోరీ అనే అంశాన్ని క్షేత్ర స్ధాయిలో ప్రజల ముందుకు తీసుకెళ్లడమే కాకుండా, పార్లమెంటులో కూడా ఎన్నికల ప్రధాన అదికారి జ్ఞానేశ్వర్‌ మీద అభిశంసన తీర్మాణం ప్రవేశపెట్టాలని ఇండియా కూటమిలో వున్న ప్రతిపక్ష పార్టీలు యోచిస్తున్నాయి. ఇంతకీ అభింశన అంటే ఏమిటో కూడా తెలుసుకోవాలి. రాజ్యంగం ప్రకారంకొన్ని రాజ్యాంగ బద్ద పదువులుంటాయి. అందులో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, సుప్రింకోర్టు ఫ్రధాన న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తులు, గవర్నర్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, ఎన్నికల కమీషన్‌ సభ్యులు ఏదైనా పొరపాటు చేశారన్న ఆరోపణలమీద పార్లమెంటులో అభిశంసన తీర్మాణం ప్రవేశపెట్టొచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 61 ప్రకారం పార్లమెంటు సభ్యులకు ఈ హక్కు వుంటుంది. దీని ప్రకారం పార్లమెంటు ఉభయ సభల సభ్యులు 2/3 మెజార్టీతో అభింశసన ద్వారా తొలగించే అవకాశంవుంది. మనదేశంలో ఇప్పటి వరకు అలా అభింశసన ఎదుర్కొన్నవారు ఎవరూ లేరు. ఇప్పుడు ప్రతిపక్షాలు తొలిసారి ఎన్నికల ప్రధాన కమీషనర్‌ మీద అభింశసన ప్రవేశపెట్టే యోచన చేస్తున్నాయి. అందుకు 50 మంది పార్లమెంటు సభ్యులు సంతకాలు చేస్తే సరిపోతుంది. అయితే అభింశసన తీర్మాణం గెలవాలంటే ప్రతిపక్షాలకు సరిపోయేంత బలం రెండు సభలలోనూ లేదు. కాని ఎన్నికల సంఘంలో జరుగుతున్న అవకతవకలపై ప్రజలకు ముందు అన్ని విషయాలు పెట్టేందుకు అవకాశం వుంటుంది. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలు క్షేత్ర స్దాయిలో ఎంత ప్రయత్నం చేసినా, అవి ప్రజల్లోకి వెళ్లాంటే పూర్తి స్ధాయిలో వెళ్లే అవకాశం లేదు. అదే పార్లమెంటు వేదికగా చేసుకొని చెప్పే ప్రతి విషయం ప్రజలకు చేరుతుంది. ప్రజలు కూడా నిజా నిజాలు తెలుసుకునే అవకాశం వుంటుంది. ఎన్నికల సంఘం కూడా పార్లమెంటుకు సమాదానం చెప్పాల్సిన అవసరంవుంటుంది. ఈ చర్చలో అదికారపార్టీ బిజేపితోపాటు, ఎన్డీయే పార్టీల అభిప్రాయాలు కూడా స్వేచ్చగాచెప్పుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్రతిపక్ష పార్టీలకు చేదిన 25 పార్టీల సభ్యులు కూడా ఇందులో పాలు పంచుకునేందుకు వీలు కల్గుతుంది. నిజం చెప్పాలంటే గోటితో పోయే దానిని ఎన్నికల కమీషన్‌ గొడ్డలిదాకా తెచ్చుకున్నట్లే కనిపిస్తోంది. తాజాగా ఎన్నికల ప్రధాన అదికారి చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. వాటిలో ప్రధానమైన విషయం ఎన్నికల ప్రధాన కమీషనర్‌ కూడా రాజకీయ పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్నట్లు వుందన్న చర్చ జోరుగా సాగుతోంది. దేశంలోనే అత్యున్నతమైన చట్ట సభ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాందీని ఉద్దేశించి ఎన్నికల ప్రదాన కమీషనర్‌ జ్ఞానేశ్వర్‌ వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలనడం కూడా వివాదాస్పదమౌతోంది. నిజంగా రాహుల్‌గాందీ చేసిన ఆరోపణల్లో నిజం లేదని నిరూపించి, ఆయనపై చర్యలు తీసుకునేందుకు కూడా వీలుంది. కాని ఎన్నికల సంఘం ఆ పని చేయడానికి ముందు వెనుకాడుతోంది. అంటే ఎక్కడో ఏదో తేడా జరిగిందనేది పరోక్షంగా ఒప్పుకునట్లే అర్దమౌతోంది. ఈ మధ్య ప్రతిపక్ష పార్టీలకు చెందిన 300 మంది ఎంపిలు ఎన్నికల సంఘం కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వినతి పత్రం ఇవ్వాలనుకున్నారు. కాని ఎన్నికల సంఘం అందుకు ఒప్పుకోలేదు. పైగా డిల్లీ ప్రభుత్వం వారిని అరెస్టు చేసింది. ఓ వైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ, ఎంపిల అరెస్టు ఇప్పటికే వివాదమైపోయింది. ఇప్పుడు ఎన్నికల సంఘం రాహుల్‌ గాంధీ అఫిడవిట్‌ ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చు? అని చెప్పడం విడ్డూరంగా వుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం ముందు ఇప్పటికే 13వేల అఫిడవిట్లు పెండిరగ్‌లో వున్నాయి. వాటికే ఇప్పటి వరకు సమాదానం గతి లేదు. మళ్లీ రాహుల్‌ గాందీ అఫిడవిట్‌ ఇస్తే తేల్చుతారా? అంటూ ఉత్తర ప్రదేశ్‌ మాజీ సిఎం. అఖిలేశ్‌ యాదవ్‌ ప్రశ్నించారు. ఏది ఏమైనా ఎన్నికల సంఘం ఇబ్బందికరమైన పరిస్ధితులను ఎదుర్కొవాల్సి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాల వాదన ప్రజలు ఇంతగా నమ్ముతారని ఎన్నికల సంఘం ఊహించలేదు. పైగా సుప్రింకోర్టు కూడా ఈ విషయంలో ఎన్నికల సంఘానికి అల్టిమేటమ్‌ ఇప్పటికే జారీ చేసింది. సిసి. పుటేజీలు ఇవ్వాలని రూల్‌ లేదంటూ ఎన్నికల సంఘం చెప్పిన సమాధానాన్ని ప్రజలు స్వాగతించలేకపోతున్నారు. ఎన్నికల్లో అవకతవకలు జరకుండా, ఎలాంటి రిగ్గింగులు జరక్కుండా, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణ కోసమే సిసి టీవిలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటప్పుడు సిసి. టివి పుటేజ్‌లు ఇవ్వడం కుదరదని ఎన్నికల సంఘం చెప్పడం సరైంది కాదు. అది గోప్యతకు చెందిన అంశమని చెప్పడంలో అర్దం లేనిది. గతంలో బ్యాలెట్‌ ద్వారా జరిగే ఎన్నికల్లో రిగ్గింగ్‌ చేస్తున్నారని, పాదర్శంగా వుండాలనే గతంలో కాంగ్రెస్‌ పార్టీ ఈవిఎంల విదానాన్ని తెచ్చింది. ఎందుకంటే టెక్నాలజీని ఎవరూ మోసం చేయలేరని అనుకున్నారు. కాని ఇలా జరుగుతుందనుకోలేదు. ఈవిఎంలు హాక్‌ చేసే అవకాశం లేదని ఎన్నికల సంఘం బల్లగుద్ది మరీ చెబుతోంది. అలాంటప్పుడు ఎన్నికల్లో అవకతవకలపై వెనుకుడుగులు వేయాల్సిన అవసరం లేదు. ఎన్నికల సంఘం ఇలా దాగుడు మూతలు ఆడడాన్నే ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ఒక్క బిహార్‌లోనే 65లక్షల ఓట్లు తొలగించడం అంటే సామాన్యమైన విషయం కాదు. వాటి వివరాలు ఇవ్వడానికి ఎన్నికల సంఘం ముందుకు రాకపోవడంతో ప్రతిపక్షాల వాదన మరింత బలపడిరది. ఎన్నికలలో పొరపాట్లు జరుగుతున్నాయనే కాదు, ఏకంగా బిజేపి, ఎన్నికల సంఘం కలిసి ఓట్లు దొంగతనం చేస్తున్నాయని రాహుల్‌ గాందీ చేసే ఆరోపణ సామాన్యమైంది కాదు. అంతే కాకుండా బెంగులూర్‌లోని సెంట్రల్‌ పార్లమెంటు స్ధానంలో ఏం జరిగిందనే విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. దేశమంతా ఇదే జరిగిందని ఆరోపిస్తున్నారు. సరిగ్గా ఎన్నికలు జరిగితే బిజేపికి 15 పార్లమెంటు సీట్లు కూడా వచ్చేవి కాదంటూ కూడా రాహుల్‌ గాందీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దానిని నిగ్గు తేల్చాల్సిన బాద్యత ఎన్నికల కమీషన్‌ మీదే వుంది. అంతే కాదు ఓట్లు తొలగించడంలో చనిపోయిన వారిగా కొందరి ఓట్లు తీసేశారనేది రాహుల్‌ గాంధీ ప్రదాన అరోపణ. అలా బతికి వుండి ఓట్లు పోయి, ఎన్నికల సంఘం దృష్టిలో చనిపోయిన వారితో రాహుల్‌ గాందీ చాయ్‌ తాగారు. చనిపోయిన వారితో చాయ్‌ తాగుతానని తాను ఊహించలేదని రాహుల్‌ గాంధీ ప్రజాస్వామ్యం కళ్లు తెరిపించారు. ఇంత జరిగినా ఎన్నికల సంఘం తన మొండి పట్టు వీడడం లేదు. దాంతో రాహుల్‌ గాంధీ బిహార్‌లో యాత్ర చేపట్టారు. అటు ప్రజలను చైతన్యం చేయడం, ఇటు ఎన్నికల ప్రదాన కమీషనర్‌ మీద అభిశంసనంతో దేశ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కిస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version