ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి
చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ఆకస్మిక తనిఖీ
మండల విద్యాశాఖ అధికారి కున్సోతు హనుమంతరావు
నడికూడ:నేటిధాత్రి
మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి కున్సోతు హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రార్ధన సమయాని కంటే ముందుగానే పాఠశాలను సందర్శించి,విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి ప్రార్థన చేశారు.అనంతరం మండల విద్యాశాఖ అధికారి కున్సోతు హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా నిత్యం పాఠశాలలను పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలోని ప్రార్థన జరుగుతున్న విధానాన్ని పరిశీలించి విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు.ఆ తర్వాత పాఠశాలలోనే మధ్యాహ్న భోజన రికార్డులను, విద్యార్థుల హాజరు పట్టికలను,ఉపాధ్యాయుల హాజరు పట్టికలను పరిశీలించారు. ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు తగిన సూచనలు సలహాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయలు అచ్చ సుదర్శన్ ఉపాధ్యాయులు లకావత్ దేవా ఉన్నారు.