యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపోడటానికి కృషి చేయాలి

ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పరకాల నేటిధాత్రి
పరకాల నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు సోమవారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాప్ కార్యాలయంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో రేవూరి ప్రకాశ్ రెడ్డి పరకాల ప్రాంత చరిత్రను చెబుతూ ఈ ప్రాంతమునకు పూర్వ వైభవం తెచ్చేందుకు అందరూ వారి వారి శాఖల పరంగా సహకారం అందించాలని కోరారు.నియోజకవర్గ అభివృద్ధి యువత ద్వారానే సాధ్యమని యువతకు తగు శిక్షణ ఇచ్చి శిక్షణా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి తగిన సలహాలు అవసరమైన చర్యలు తీసుకోవడానికి సూచనలు ఇవ్వవలసినదిగా అధికారులలు సూచనలుచ్చారు.అందుకు
యువకులకు కావలసిన ఉపాధి అవకాశాలను పెంపొందించుటకు సాధ్యసాధ్యాలపై అధికారులతో చర్చించి పలు నిర్ణయాలు చేశారు.పోలీసు శాఖ నుండి ప్రతి గ్రామానికి 10 మంది యువకులను ఎంపిక చేసి మండలానికి కనీసం100 మంది యువకులను గుర్తించి వారికి తగిన శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి రంగాల్లో రాణించేలా చర్యలు చేపట్టేందుకు తగిన విధివిధానాలను ఖరారు చేయాలని ఆయన అధికారులను కోరారు.ప్రతి డిపార్ట్మెంటులో వారి వారి శాఖలకు సంబంధించిన మెరుగైన ప్రణాళికతో చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు జిల్లా అధికారులతో మరోసారి తిరిగి డిసెంబర్ 21వ తేదీన సమావేశం నిర్వహించాలని అట్టి సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరయ్యేలా వారికి సమాచారం ఇచ్చ మెరుగైన ప్రణాళికతో నివేదికలను తీసుకొని రావలసినదిగా రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమం లో పరకాల నియోజకవర్గ పరిధిలోని పోలీసు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!