
జిల్లా వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి.
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామేర కిరణ్.
భూపాలపల్లి నేటిధాత్రి
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామర కిరణ్ అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో విద్యారంగ సమస్యలతో సతమతమవుతున్న విద్యార్థుల సమస్యలు పట్టించుకోకపోవడం నిర్లక్ష్యం అన్నారు దాంతోపాటు సంవత్సరాల నుంచి. గత మూడు సంవత్సరాల నుంచి 8 వేల కోట్ల రూపాయల పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల డిగ్రీ పూర్తి చేసి పై చదువులకు వెళ్లే విద్యార్థులకు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు సందర్భంగా తెలియజేశారు తక్షణమే బకాయిలను విడుదల చేయాలని వారు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించారు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి సందర్భంగా తెలియజేశారు కొన్ని కొన్ని పాఠశాలల్లో వందల మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఒకటి రెండు వాష్రూమ్స్ కంటే ఎక్కువ లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా స్థానికంగా జిల్లా కేంద్రంలో ఇంటర్ మరియు డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఎస్ఎంఎస్ హాస్టల్స్ సొంతభవనాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే నిర్మాణాల్లో ఉన్న భవనాలను పూర్తిచేయాలని వారు అన్నారు సమావేశం అనంతరం వారు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బీఈడీ కళాశాల లా కళాశాల ఏర్పాటు చేయాలని వారు అన్నారు ఈ జిల్లాలో చదువుకోవడానికి అవకాశం ఉన్న హాస్టల్ సౌకర్యం లేకపోవడం వల్ల విద్యార్థులు గత కొన్ని సంవత్సరాలుగా అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఉన్నారు తక్షణమే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు లేనియెడల జిల్లా వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సమర్శిల పోరాటాలకు సిద్ధమవుతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బొడ్డు స్మరణ జిల్లా కమిటీ సభ్యులు సాగర్ నిర్మల్ అర్జున్ సూర్య తదితరులు పాల్గొన్నారు