
Ambedkar Center
విద్య సంస్థల బంద్ విజయవంతం
విద్యా శాఖ మంత్రిని వెంటనే నియమించాలి
వాపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో వామ పక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంధు జయప్రదం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా వామ పక్ష విద్యార్థి సంఘ నాయకులు అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం తెలియజేశారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోతుకు.ప్రవీణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు లు మాట్లాడుతూ విద్యరంగ సమస్యలు పరిష్కరించడం లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి రెండు సంవత్సరాల అవుతున్నప్పటికీ విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం చాలా సిగ్గుచేటు అని అన్నారు.
ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలో ఫీజులను తగ్గించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ విద్యాసంస్థల నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ఖాళీగా ఉన్న టీచింగ్,నాన్ టీచింగ్,ఎంఈఓ,డిఈఓ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వ స్కూల్ వ్యాన్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో వామ పక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని తెలిపారు. విద్యాసంస్థలబంద్ ను జయప్రదం చేసిన ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల జూనియర్ డిగ్రీ యాజమాన్యాలకు, విద్యార్థులకు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు మేడి శేఖర్ మణికంఠ వరుణ్ వికాస్ పొంగంటి రాజేష్ అజయ్ పవన్ ముద్దమల్ల విష్ణు హర్షవర్ధన్ నరేష్ చారి తదితరులు పాల్గొన్నారు.