
మండలంలోని విద్యాసంస్థలు సంపూర్ణంగా బందు
యస్ ఎఫ్ ఐ మంగపేట మండల అధ్యక్షుడు చెట్టుపల్లి చందు
మంగపేట నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం 2025_ 26 విద్యా సంవత్సరంప్రారంభమై రెండు నెలలుగడుస్తున్నా ప్రభుత్వపాఠశాలలో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నప్పటికీ ఇప్పటివరకు అన్ని పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించడం లేదని ఎస్ఎఫ్ఐ (స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) మంగపేట మండల అధ్యక్షుడు చెట్టు పల్లి . చందు ప్రభుత్వాన్ని ఖండించడం జరిగింది….
మండల కేంద్రంలో చందు మాట్లాడుతూ.. ఈ రెండు నెలల్లో మండలంలో ఉన్న ప్రతి ప్రాథమిక , ప్రాథమికోన్నత, ఉన్నత, ఆశ్రమ పాఠశాలలో సందర్శించడం జరిగింది.. ఇందులో భాగంగా ప్రతిపాఠశాలలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు సరిపడే విధంగా ఉన్నందున అడ్మిషన్లు సంఖ్య పెరిగింది… కానీ ప్రతి పాఠశాలలో బాల, బాలికలకు కనీస టాయిలెట్స్ లేవు. ముఖ్యంగా బాలికలు టాయిలెట్ చాలా ఇబ్బందులు గురవుతున్నారు ప్రతి విద్యార్థిని విద్యార్థులకు రెండు యూనిఫామ్ ఇవ్వకుండా ఓకే యూనిఫామ్ ఇచ్చారు.. టెక్స్ట్, నోట్ బుక్స్ కూడా అన్ని టైటిల్స్ పంపిణీ రాలేదు సీఎం బ్రేక్ఫాస్ట్ నిలుపుదల చేశారు, మధ్యాహ్న భోజనంలో అనేక లోపాలు ఉన్నాయి ఏజెన్సీ వాళ్ళని అడిగితే మాకు డబ్బులు గత ఆరు నెలల నుండి రావడం లేదు అంటున్నారు ప్రతి పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం అందించడం లేదు… కావున పై విషయాన్ని పూర్తిగా పరిశీలింప చేసి ప్రభుత్వం కామా ప్రభుత్వాధికారులు ఇప్పటికైనా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు సరైన విద్యను అందించి మన జిల్లాను అభివృద్ధిలో ముందు ఉంచాలని ఎస్ఎఫ్ఐ మండల శాఖ ప్రభుత్వాన్ని కోరారు…. ఇందులో భాగంగా విద్యార్థి సంఘాల నాయకులు….