విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
రాష్ట్రంలో విద్యాప్రమాణాలు తగ్గాయని. విద్య మెరుగుపడాలంటే మాతృభాష విద్య బోధించవలసిందిగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, సనాత ధర్మ పరిరక్షణకై విద్య ఎంతో తోడుపడుతుందని. అలాంటి విద్యను శ్రీ సరస్వతి శిశు మందిరాలు అందిస్తాయని జమ్మికుంట పట్టణంలోని శ్రీ సరస్వతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ స్వర్ణజయంతి ఉత్సవంలో ‘ స్వర్ణ జ్యోతి భవనాన్ని ప్రారంభం సందర్భంగా వారు పూర్వ విద్యార్థులకు పోషకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు శీలం శ్రీనివాస్, పాఠశాల వ్యవస్థాపకులు పూజలు సాంబయ్య, విద్యాపీఠ రాష్ట్ర సంఘటన కార్యదర్శి పథకమూరి శ్రీనివాసరావు, పాక రాజమౌళి, కాటం రవీందర్, మున్సిపల్ చైర్మన్ తక్కెళ్ళపల్లి రాజేశ్వరరావు, గంగాడి కృష్ణారెడ్డి సమితి అధ్యక్ష కార్యదర్శులు ఆవల రాజారెడ్డి, ఆకుల రాజేందర్, గర్రెపల్లి అరుణ్ కుమార్, సురేందర్ రాజు, దాసరి రవీందర్ ప్రధానాచార్యులు గుడికందుల సుదర్శన్, అనేకమంది పెద్దలు, పూర్వ విద్యార్థులు, విద్యార్థులు పాల్గొన్నారు.