ప్రిన్సిపల్ సంతోష్ కుమార్ ను అభినందించిన అధికారులు
పరకాల,నేటిధాత్రి
ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరకాలలో ప్రిన్సిపాల్ గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ బి. సంతోష్ కుమార్ ను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితారాణ మరియు కళాశాల విద్య కమిషనర్ ఎ.దేవసేన అభినందించారు.ప్రభుత్వ డిగ్రీ కళాశాల తొర్రూరులో ప్రిన్సిపల్ గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో గేల్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వారి సహకారంతో నాలుగు కోట్లు మంజూరు చేయించి నూతన కళాశాల భవనాన్ని నిర్మించినందుకు అలాగే ప్రస్తుతం పరకాలలో డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి కృషి చేసినందుకు మరియు డిగ్రీ కళాశాలలో విద్యార్థుల ప్రవేశాలు పెంచడంతోపాటు వారి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్నందుకుగాను అక్టోబర్ 29,30 తేదీల్లో రెండు రోజులపాటు హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్ సమావేశంలో ఆయనను అధికారులు ప్రశంసించి, అభినందించారు
