మన ఊరు మనబడి తో ప్రభుత్వ పాఠశాలలో అత్యాధునిక హంగులు
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
గుండాల మండలం లోని జగ్య తండ గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాల నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మన ఊరు మనబడి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సుమారు 32 లక్షల రూపాయలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది, విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ లో ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతున్నదని ఆయనని మన ఊరు మనబడి కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రభుత్వ బడులు రూపురేఖలు మారాయి అన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా మన ఊరు మనబడి చేపట్టి ప్రభుత్వ పాఠశాలలో 12 రకాల మౌలిక వసతులు కల్పించామన్నారు విద్యారంగంలో చేపట్టిన సంస్కరణల వల్ల ప్రభుత్వ పాఠశాలలో పెద్ద ఎత్తున విద్యార్థులు చేరికలు జరుగుతున్నాయి అన్నారు.