
Education has the power to change a person's life.
*మనిషి జీవితాన్ని మార్చే శక్తి చదువుకు వుంది…
*కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు..
*విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఉన్నత శిఖరాలకు ప్రభుత్వ విద్య..
*అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చెస్ క్రీడా పై శిక్షణ ఏర్పాటు చేస్తాం..
*తుడా ఛైర్మెన్ డాలర్స్ దివాకర్ రెడ్డి..
తిరుపతి(నేటి ధాత్రి) జూలై 10:
విద్యార్థులు పట్టుదల, కృషితో చదివితే జీవితంలో ఉన్న స్థాయికి చేరుకోగలరని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. గురువారం తిరుపతి కొర్లగుంట లోని శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ నందు మెగా పేరెంట్స్ మీటింగ్ ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారుఈ సందర్భంగా ఆయన స్కూల్ ఆవరణలో మొక్కలు నాటి నీరు పొశారు. అనంతరం విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. నేడు కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులతో పాటు విద్యా ప్రమాణాలు మెండుగా ఉన్నాయని కొనియాడారు. యువ నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో డొక్కా సీతమ్మ నాణ్యమైన మధ్యాహ్న భోజనం, ఉచితంగా పుస్తకాలు, ఉచితంగా యూనిఫామ్, షూ లు అందిస్తున్నారని, అదేవిధంగా ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కింద 13000 జమ చేయడం జరిగిందని తెలియజేశారుదేశంలో మరే ఇతర రాష్ట్రంలో కూడా ఈ విధంగా ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాలు లేవని చెప్పారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ స్థాయికి వచ్చానని గుర్తు చేశారు. చదువుతోపాటు ఆటపాటల్లో విద్యార్థులు రాణించాలని సూచించారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు జీవితంలో కష్టాలను ఎదుర్కొనే శక్తి అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. గురువులను ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలకు వెళ్లాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల తెలివితేటలను పెంచేందుకు త్వరలో ప్రతి పాఠశాలలో చెస్ క్రీడ పై శిక్షణ ఏర్పాటు చేస్తామని ఈ విషయాన్ని తాను విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబుకు వివరించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలకు తుడా తోపాటు తన వ్యక్తిగతంగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని పాఠశాల అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్
మాస్టర్, రవిచంద్రన్, ఇన్ చార్జీ,
హెడ్
మా
స్టర్ రవికుమార్, పాఠశాల చైర్మన్ వాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.