Education Changes Lives
చదువు జీవితాన్ని ఇస్తుంది
వనవాసీ గౌరవ అద్యక్షులు మల్లాది సుబ్రహ్మణ్యం
చర్ల నేటిదాత్రి
ప్రతి ఒక్కరికి విద్య ఎంతో అవసరమని విద్య ద్వారానే గుర్తింపు లబిస్తుందని వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయం గౌరవ అద్యక్షులు మల్లాది సుబ్రహ్మణ్యం అన్నారు జవ్వాది కుటుంబ సభ్యుడు హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి జవ్వాది ప్రశాంత్ తన స్నేహితులు కదిరి ముని యుగందర్ త్రిపురాన నాగరాజు బొడ్డు శ్రీనివాస కార్తీక్ వొల్లోజు బాగ్య సహకారంతో చర్ల వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయంకు 23 వేల విలువ చేసే అమరాన్ ఇన్వర్టర్ ను ఆమరాన్ బ్యాటరీను అందచేసారు ఈ సందర్భంగా నిలయ కమిటీ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ అద్యక్షతన జరిగిన సమావేశంలో మల్లాది విద్యార్దులను ఉద్దేసించి ప్రసంగించారు జవ్వాది ప్రశాంత్ స్నేహితులు ప్రతి ఏటా ఆవాసానికి కావాల్సిన విలువైన వస్తువులను అందచేసి విద్యార్దుల చదువులలో కీలక భూమిక పోషిస్తున్నారని ప్రశంసించారు గత ఏడాది విద్యార్దుల అవసరార్థం ట్రంక్ పెట్టెలను ఇప్పుడు విద్యుత్ లో అంతరాయం ఏర్పడ్డ సమయంలో చదువులకు ఆటంకం కలగకుండా ఇన్వర్టర్ ను అందించడం సంతోషకరమని పేర్కొన్నారు డబ్బు ఉంటే సరిపోదని ఒక సామాన్యుడు ఉన్నత ఉద్యోగం పొందితే వారిని మనం గౌరవిస్తామని ఈ గౌరవం చదువు ద్వారా లబించిన ఉద్యోగంతోనే వచ్చిందని మనమంతా గుర్తించాలని అన్నారు జీవితంలో ఎదిగేందుకు ఉపయోగపడేది చదువేనని చదువు ద్వారా జీవన విదానం మెరుగుపడుతుందని పేర్కొన్నారు అన్ని సౌకర్యాలు సమకూరినపుడే చదువువై దృష్టి ఉంటుందని ఈ సౌకర్యాలను సమకూర్చడంలో నిలయ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ పాత్ర మరువలేనిది ప్రశంసించారు వనవాసీ గౌరవ సలహాదారులు బివిఎస్ఎల్ నరసింహారావు మాట్లాడుతూ వనవాసీ విద్యార్దుల సమస్యలను గమనించి వాటిని వేగవంతంగా పరిష్కరిస్తున్న కార్యదర్శి, ఇతర కమిటి సభ్యుల పనితీరు అద్బుతమని అన్నారు విద్య జీవన విధానంలో వెనుకబడిన వర్గాల కొరకు సంస్ద పనిచేస్తోందని విద్యార్దులను సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుతోందన్నారు కమిటీ సభ్యులు విద్యార్దులు చదువుతున్న పాఠశాల ఉపాద్యాయులతో సంబందాలు కలిగిఉండి వారు చదువుతున్న తీరును గమనించాలని విజ్ఞప్తి చేసారు విశ్రాంత ఉపాద్యాయులు జవ్వాది నరేంద్ర బాబు మాట్లాడుతూ వనవాసీ కమిటి సభ్యుల సమిష్టి కృషి అభినందనీయని అన్నారు విద్యార్దుల అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా వస్తు సేకరణ చేయడం సంతోషకరమని పేర్కొన్నారు సేవాగుణం కలిగిన కమిటి సభ్యులు ఉండటంతో సంస్ద రోజురోజుకూ అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు విద్యార్దులు దాతల మనోభావాలకు అనుగుణంగా చదువుకొని బాద్యతను నెరవేర్చాలని పేర్కొన్నారు వనవాసీ జిల్లా కార్యదర్శి కోరం సూర్యనారాయణ మాట్లాడుతూ సమాజం కొరకు అలోచించే సేవాభావం కలిగిన వారే కమిటి సభ్యులుగా ఉంటారన్నారు అవసరాలను గుర్తించే దాతలు కార్యదర్శి సంస్దకు లబించడం తమకు వరమని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ విద్యార్దులపై ప్రత్యేక శ్రద్దకనపరిచి వారి ఉన్నతిలో బాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నిలయ కమిటీ అద్యక్షులు తాటి పాపారావు ఉపాద్యాయులు గోగికార్ రాంలక్ష్మణ్ సత్యనారాయణ మూర్తి సభ్యులు లవన్ కుమర్ రెడ్డి జవ్వాది కుటుంబ సభ్యులు సతీష్ కుమార్ శ్రీనివాస్ కౌషిక్ నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి పాల్గొన్నారు
