విద్య, వైద్యం కాంగ్రెస్ ముఖ్య ద్యేయం
• ఎమ్మెల్యే రోహిత్ రావు
నిజాంపేట: నేటి ధాత్రి
విద్య, వైద్యన్నీ అందిచడమే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య ద్యేయమని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం నిజాంపేట మండల కేంద్రంలో పర్యటించి జై బాపు, జైసంవిధాన్ లో భాగంగా మండలం లో ర్యాలీ నిర్వహించారు. అలాగే సన్న బియ్యం, ఆరోగ్య ఉప కేంద్రన్నీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో చేయలేని అభివృద్ధినీ కాంగ్రెస్ 15 నెలల్లో చేసి చూపిస్తుందని కొనియడారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, వైద్య కళాశాల ను కాంగ్రెస్ హయాంలో ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రమాదేవి, కాంగ్రెస్ నాయకులు చౌదర సుప్రభాతరావు, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజా మహేందర్, పట్టణ అధ్యక్షుడు నసిరుద్దీన్, సత్యనారాయణ, లింగం గౌడ్, గుమ్ముల అజయ్, దేశెట్టి సిద్దారములు, సత్యనారాయణ రెడ్డి,శ్యామల మహేష్, అధికారులు ఉన్నారు.