
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లె గ్రామంలో శ్రీ రామలింగేశ్వర అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నంది గణపతికి ప్రత్యేక పూజలు చేసిన ఎడ్ల మాధవి సంతోష్ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఆలయ అర్చకులు రాజకుమార్ ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనం చేశారు ఈ సందర్భంగా ఎడ్ల సంతోష్ దంపతులు మాట్లాడుతూ మా కుటుంబం సభ్యులు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో అలాగే మా గ్రామం ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని నంది గణపతిని వేడుకోవడం జరిగినదని తెలిపారు