మత్స్యకారులకు నూతన సభ్యత్వం కార్డుల పంపిణీ
నర్సంపేట,నేటిధాత్రి :
మత్స్య సంపద వల్ల మత్స్య సహకార సంఘ సభ్యులు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఎంతోగానో ఉపయోగపడుతుందని జిల్లా మత్స్యశాఖ అధికారి నరేష్ కుమార్ నాయుడు,వరంగల్ జిల్లా ఉమ్మడి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు భూస మల్లేశం అన్నారు.
దుగ్గొండి మండలంలోని రేకంపల్లి గ్రామంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు జిల్లా డైరెక్టర్ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు పొన్నం మొగిలి ముదిరాజ్ అధ్యక్షతన రేకంపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో 69 మంది సభ్యులకు నూతనంగా సభ్యత్వం కార్డులను పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా వరంగల్ జిల్లా ఉమ్మడి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు భూసా మల్లేశం, జిల్లా మత్స్యశాఖ అధికారి నరేష్ కుమార్ నాయుడు,జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చీఫ్ ప్రమోటర్ సోమయ్య దుగ్గొండి మండల అభివృద్ధి అధికారి కృష్ణ ప్రసాద్ హాజరైయ్యారు.ఈ సందర్భంగా మత్స్య సహకార సంఘంలో నూతనంగా సభ్యత్వం పొందిన వారిని అభినందించారు.అనంతరం వారు మాట్లాడుతూ మత్స్య సంపద వల్ల మత్స్య సహకార సంఘ సభ్యులు ఆర్థికంగా బలోపేతం చేసుకుంటూ
పిల్లల భవిష్యత్తు స్థిరపడే విధంగా తల్లిదండ్రులు బాధ్యతగా మెదలాలని సూచించారు.మత్స్యజాతి ఎంతగానో వెనుకబడి ఉన్న నేపథ్యంలో రిజర్వేషన్ పరంగా విద్యలో ఉద్యోగాలలో ఎంతగానో నష్టం జరుగుచున్నదని హక్కుల కోసం ముదిరాజులంత ఐక్యంగా ఉంటూ హక్కుల సాధన కోసం పోరాటం చేయాలని సంబంధిత నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ కుల పెద్దలు పొన్నం సాంబయ్య, తోటి రవి, మత్స్యశాఖ ప్రధాన కార్యదర్శి సాంబయ్య, సుధాకర్, ఉపాధ్యక్షులు నరసింహస్వామి, డైరెక్టర్లు పొన్నం కుమారస్వామి, శానబోయిన నరసింహస్వామి, కొత్తూరు ఐలయ్య,కానుగుల రవి,కుమారస్వామి, మాజీ ఉపసర్పంచ్ షానబోయిన నరసింహస్వామి, మాజీ వార్డ్ మెంబర్స్ రాజేందర్, రాంబాబు, పొన్నం వంశీ, సభ్యులు పాల్గొన్నారు.