
Gyanesh Kumar
బీహార్ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) పై వచ్చిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది.
ముఖ్య ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ మాట్లాడుతూ – “ఎన్నికల దోపిడీ ఆరోపణలు భారత రాజ్యాంగానికి అవమానం” అని హెచ్చరించారు.
అన్ని రాజకీయ పార్టీల డిమాండ్ మేరకే ఓటర్ల జాబితాలో మార్పులు చేయడానికి SIR చేపట్టామని ఆయన తెలిపారు. మొత్తం 1.6 లక్షల బూత్ లెవల్ ఏజెంట్లు, పార్టీల ప్రతినిధులు కలిసి డ్రాఫ్ట్ లిస్ట్ తయారు చేశారని స్పష్టం చేశారు.
“గ్రౌండ్ రియాలిటీని పట్టించుకోకుండా అపోహలు సృష్టించడం ప్రజాస్వామ్యానికి హానికరం” అని గ్యానేశ్ కుమార్ హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, న్యాయంగా సాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.