ఎండపల్లి మండలంలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు!!

మహిళ సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది స్థానిక ఎంపిటిసి సభ్యులు మహ్మద్ బషీర్!!!
మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి ఏపిఎం చంద్రకళ!!
ఎండపల్లి నేటి ధాత్రి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో పీసీసీ కార్యవర్గ సభ్యులు స్థానిక ఎంపీటీసీ సభ్యులు, మహ్మద్ బషీర్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ముందస్తుగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా, నిర్వహించారు, మహిళల సమక్షం లో కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు,ఈ సందర్భంగా పిసిసి కార్యవర్గ సభ్యులు స్థానిక ఎంపీటీసీ సభ్యులు మహమ్మద్ బషీర్ మాట్లాడుతూ మహిళా సంక్షేమం కొరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరుగుతుంది, అందులో భాగంగా ఇటీవల మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ ఫ్రీ బస్సు పథకం ఉచిత గృహ జ్యోతి విద్యుత్ పథకం, 500 కే సిలిండర్ మరియు రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆడ పడుచులకు కళ్యాణ లక్ష్మి పథకం తులం బంగారం లాంటి రాబోయే పథకాలు కూడా అన్ని ఎక్కువ వరకు మహిళా సంక్షేమం కొరకు అని గ్రహించి మహిళల సంక్షేమం కొరకే పాటు పడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పడం జరిగింది, ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసమే పని చేస్తుంది. ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుంది మహిళలు బాగుంటే ప్రభుత్వం బాగుంటుంది అందుకే మహిళా సంక్షేమ ధ్యేయంగా పనిచేసేది కేవలం మన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అని చెబుతూ,మహిళా లేనిదే సమాజం లేదు, మహిళా అభివృద్దే ధ్యేయంగా రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూస్తామని తెలిపారు,అలాగే రేపటి శివరాత్రి పండుగ నీ మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని తెలిపారు,అనంతరం ఉమ్మడి వెల్గటూర్ మండల ఎపిఎం చంద్రకళ మాట్లాడుతు ప్రభుత్వం మహిళకు పెద్దపీట వేయడం మాకు చాలా సంతోషం గా ఉందని,ప్రతి ఒక్క మహిళ రాబోయే రోజుల్లో ప్రతి పతకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ,మాకు ఇన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు,ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతి ప్రత్యేక అధికారి తహశీల్దార్ రవికాంత్,ఏపీఎం చంద్రకళ,కార్యదర్శి ప్రభాకర్ మహిళా సంఘాల సభ్యులు,అభిమానులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!